Indian Coast Guard Civilian Recruitment 2025: ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, డ్రాఫ్ట్స్ మన్, లాస్కార్, ఫైర్ మ్యాన్, MTS, అన్ స్కిల్డ్ లేబర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

Indian Coast Guard Civilian Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ కోస్ట్ గార్డ్, వెస్ట్ రీజియన్, ముంబై |
పోస్టు పేర్లు | స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, డ్రాఫ్ట్స్ మన్, లాస్కార్, ఫైర్ మ్యాన్, MTS, అన్ స్కిల్డ్ లేబర్ |
పోస్టుల సంఖ్య | 13 |
దరఖాస్తు ప్రక్రియ | 27 సెప్టెంబర్ – 11 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | పోస్టు ద్వారా |
Also Read : SSC Delhi Police Head Constable(Ministerial) 2025 | 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతదేశ సముద్ర తీర రక్షణ దళం సముద్ర ప్రాంతాల్లో భద్రత, దోపిడీ, స్మగ్లింగ్, అక్రమ రవాణా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల రక్షణ వంటి పలు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. Headquarters Coast Guard Region (West) ముంబై నుంచి వివిధ గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- Store Keeper Grade II – 01 పోస్ట్ (UR)
- Engine Driver – 01 పోస్ట్ (EWS)
- Draughtsman – 01 పోస్ట్ (UR)
- Lascar – 04 పోస్టులు (UR–3, ST–1)
- Fireman – 01 పోస్ట్ (UR)
- MTS (Daftary) – 01 పోస్ట్ (EWS)
- MTS (Peon) – 01 పోస్ట్ (UR)
- MTS (Chowkidar) – 01 పోస్ట్ (UR)
- Unskilled Labourer – 02 పోస్టులు (UR–1, EWS–1)
అర్హతలు & వయోపరిమితి:
Indian Coast Guard Civilian Recruitment 2025 పోస్టుల ఆధారంగా విద్యార్హతలు మరియు వయోపరిమితి మారుతుంది.
- Store Keeper Grade II: 12వ తరగతి ఉత్తీర్ణత + ఒక సంవత్సరం స్టోర్ హ్యాండ్లింగ్ అనుభవం, వయస్సు 18–25 సంవత్సరాలు.
- Engine Driver: 10వ తరగతి ఉత్తీర్ణత + Engine Driver సర్టిఫికేట్, వయస్సు 18–30 సంవత్సరాలు.
- Draughtsman: 10వ తరగతి + డిప్లొమా (Civil/Electrical/Mechanical/Marine Engineering) లేదా Draughtsmanship సర్టిఫికేట్, వయస్సు 18–25 సంవత్సరాలు.
- Lascar: 10వ తరగతి + 3 సంవత్సరాల బోటు సర్వీస్ అనుభవం, వయస్సు 18–30 సంవత్సరాలు.
- Fireman: 10వ తరగతి + శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ప్రత్యేక Physical/Endurance టెస్టులు ఉండును, వయస్సు 18–27 సంవత్సరాలు.
- MTS (Daftary/Peon): 10వ తరగతి + 2 సంవత్సరాల అనుభవం, వయస్సు 18–27 సంవత్సరాలు.
- MTS (Chowkidar): 10వ తరగతి + 2 సంవత్సరాల అనుభవం, వయస్సు 18–27 సంవత్సరాలు.
- Unskilled Labourer: 10వ తరగతి/ITI + 3 సంవత్సరాల అనుభవం, వయస్సు 18–27 సంవత్సరాలు.
వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, SC/ST/OBC అభ్యర్థులకు వయస్సు రాయితీ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Indian Coast Guard Civilian Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
Indian Coast Guard Civilian Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
రాత పరీక్ష – ఒక గంట వ్యవధి, 80 ప్రశ్నలు (Objective Type), సబ్జెక్టులు:
- General Knowledge
- Mathematics
- General English
- సంబంధిత ట్రేడ్‌పై ప్రశ్నలు
- ఉత్తీర్ణత మార్కులు: సాధారణ అభ్యర్థులకు 50%, SC/ST అభ్యర్థులకు 45%
ట్రేడ్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్ (అవసరమైతే) – ఉదా: Fireman పోస్టుకు ప్రత్యేక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది.
ఫైనల్ మెరిట్ లిస్ట్ – రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రకటిస్తారు.
Also Read : Army DG EME Group C Recruitment 2025 | ఆర్మీలో గ్రూప్-సి ఉద్యోగాలకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
Indian Coast Guard Civilian Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి లెవల్-1 నుంచి లెవల్-4 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Engine Driver, Draughtsman – ₹25,500 – ₹81,100 (Pay Level 4)
- Store Keeper, Fireman – ₹19,900 – ₹63,200 (Pay Level 2)
- Lascar, MTS, Chowkidar, Unskilled Labourer – ₹18,000 – ₹56,900 (Pay Level 1)
దరఖాస్తు విధానం :
Indian Coast Guard Civilian Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అభ్యర్థులు దరఖాస్తును ఇంగ్లీష్ లేదా హిందీ లో Annexure-I ఫార్మాట్‌లో పూరించాలి.
- దరఖాస్తుతో పాటు పత్రాలు (10వ/12వ సర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్, అనుభవ పత్రాలు, ఫోటోలు మొదలైనవి) స్వీయ ధృవీకరణ చేసి జతచేయాలి.
- అభ్యర్థులు ₹50/- పోస్టల్ స్టాంప్ తో కూడిన స్వీయ చిరునామా ఉన్న కవర్ ను దరఖాస్తుతో పాటు జతచేయాలి.
- దరఖాస్తులు Ordinary Post ద్వారా మాత్రమే పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
- Headquarters Coast Guard Region (West), Alexander Graham Bell Road, PO Malabar Hill, Mumbai – 400006
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11 నవంబర్, 2025
Notification & Application | Click here |
Also Read : SAMEER Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్
3 thoughts on “Indian Coast Guard Civilian Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ MTS, ఫైర్ మ్యాన్ జాబ్స్”