Indian Army TGC-142 Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్

Indian Army TGC-142 Recruitment 2025 డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ కోర్సు 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో శాశ్వత కమిషన్ కోసం అర్హులైన అవివాహిత పురుష ఇంగజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Indian Army TGC-142 Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ మిలిటరీ అకాడమీలో 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో మొత్తం 30 ఖాళీలను ఉన్నాయి. ఈ ఖాళీలు తాత్కాలికమైనవి. మరియు ఆర్గనైజేషన్ అవసరాల ఆధారంగా మార్పుకు లొబడి ఉంటాయి. 

మొత్తం పోస్టుల సంఖ్య : 30

కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ఖాళీలు
సివిల్08
కంప్యూటర్ సైన్స్06
ఎలక్ట్రికల్02
ఎలక్ట్రానిక్స్06
మెకానికల్06
ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్02

వయస్సు : 

Indian Army TGC-142 Recruitment 2025 కోర్సు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అర్హతలు: 

Indian Army TGC-142 Recruitment 2025 పోస్టులకు సంబంధిత ట్రేడ్ లో ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో ఉండాలి.

శారీరక ప్రమాణాలు : అభ్యర్థులు ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరడానికి ముందు రన్నింగ్, పుష్ అప్స్, పుల్ అప్స్, స్విమ్మింగ్ మొదలైన కనీస శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. 

వైవాహిక స్థితి: ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనింగ్ పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు. ట్రైనింగ్ సమయంలో లేదా అప్లికేషన్ సమర్పించిన తర్వాత పెళ్లి చేసుకుంటే మాత్రం అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. 

దరఖాస్తు ఫీజు: 

Indian Army TGC-142 Recruitment 2025 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

Indian Army TGC-142 Recruitment 2025 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింద దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • అప్లికేషన్ వెరిఫికేషన్ 
  • సర్వీస్ సెక్షన్ బోర్డు ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

జీతం :

Indian Army TGC-142 Recruitment 2025 కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.  శిక్షణ కాలంలో నెలకు రూ.56,100/- జీతం ఇస్తారు. 

ర్యాంక్ ఆధారంగా పే స్కేల్ : 

  • లెఫ్టినెంట్ : రూ.56,100  – రూ.1,77,500/-
  • కెప్టెన్  : రూ.61,300 – రూ.1,93,900/-
  • మేజర్ : రూ.69,400 – రూ.2,07,200/-
  • లెఫ్టినెంట్ కల్నల్ : రూ.1,21,200- రూ.2,12,400/-

దరఖాస్తు విధానం : 

Indian Army TGC-142 Recruitment 2025 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింది లింక్ ఉపయోగించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.  

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు ప్రారంభ తేదీ30- 04 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ29- 05 – 2025
కోర్సు ప్రారంభ తేదీజనవరి, 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

2 thoughts on “Indian Army TGC-142 Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!