Indian Army TES 55 Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్

Indian Army TES 55 Recruitment 2025 : ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ తాజాగా టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TES)-55 జూలై 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Indian Army TES 55 Recruitment 2025 Overview

నియామక సంస్థఇండియన్ ఆర్మీ
స్కీమ్ పేరు10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES 55)
పోస్టు పేరులెఫ్టినెంట్
పోస్టుల సంఖ్య90
ఎగ్జామ్ లెవల్నేషనల్ లెవల్
జాబ్ టైప్పర్మినెంట్ కమిషన్
దరఖాస్తు ప్రక్రియ14 అక్టోబర్ – 13 నవంబర్, 2025
కోర్సు ప్రారంభంజూలై 2026

Also Read : ONGC Apprentice Recruitment 2025 | ONGC భారీ నోటిఫికేషన్ – 2,623 ఖాళీలు

ఖాళీల వివరాలు(Vacancy Details) : 

ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్( TES) – 55 లెఫ్టినెంట్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

  • పోస్టు పేరు : లెఫ్టినెంట్
  • ఖాళీల సంఖ్య : 90

అర్హతలు(Eligibility) : 

Indian Army TES 55 Recruitment 2025 అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్(PCM) సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్.
  • ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 
  • JEE Main 2025 పరీక్షలో పాల్గొనాలి.

వయోపరిమితి(Age Limit):

Indian Army TES 55 Recruitment 2025 అభ్యర్థులకు 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు(Application Fees): 

Indian Army TES 55 Recruitment 2025 అందరు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ(Selection Process):

Indian Army TES 55 Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • షార్ట్ లిస్టింగ్ : 10+2 PCM మార్కులు + JEE Main ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • SSB ఇంటర్వ్యూ : 5-రోజుల SSB ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

Also Read : Oppo Pad 5 Launched With Dimensity 9400+ Power: Big Display, 10,420mAh Battery & 67W Fast Charging

జీతం వివరాలు(Salary Details) : 

 Indian Army TES 55 Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో రూ.56,100/- స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత లెవల్-10 ప్రకారం రూ.56,100 – రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం (How to Apply): 

 Indian Army TES 55 Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లోకి వెళ్లాలి. 
  • హొమ్ పేజీలో ‘ఆఫీసర్ ఎంట్రీ అప్లయ్/లాగిన్’ పై లేదా Indian Army TES 55 Recruitment 2025  నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 13 నవంబర్, 2025

Notification : Click here

Apply Online : Click here

Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్

2 thoughts on “Indian Army TES 55 Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!