Indian Army SSC Tech Recruitment 2026 | ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు – 350 పోస్టులు | ₹56,100 జీతం

Indian Army SSC Tech Recruitment 2026 : ఇండియన్ ఆర్మీ నుంచి ఇంజినీర్లకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ SSC (Technical) 67 Men –  2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీరింగ్ పూర్తి చేసిన అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నార. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 350 ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీలో ఆఫీసర్‌గా శిక్షణతో పాటు నెలకు ₹56,100 జీతం లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అప్లై చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

  • Mechanical Engineering – 101 పోస్టులు
  • Civil Engineering – 75 పోస్టులు
  • Electronics / ECE / E&I – 64 పోస్టులు
  • Computer Science / IT – 60 పోస్టులు
  • Electrical Engineering – 33 పోస్టులు
  • Miscellaneous Engineering Streams – 17 పోస్టులు

Also Read : Cochin Shipyard Recruitment 2026: Cochin Shipyard లో పర్మనెంట్ జాబ్స్ – 210 పోస్టులు

అర్హతలు (Educational Qualifications)

Indian Army SSC Tech Recruitment 2026 అభ్యర్థులు సంబంధిత స్ట్రీమ్స్ లో ఇంజినీరింగ్ డిగ్రీ (B.E / B.Tech) పూర్తి చేసి ఉండాలి.  ఫైనల్ ఇయర్‌లో చదువుతున్నవారు కూడా అర్హులే. 

వయోపరిమితి (Age Limit)

Indian Army SSC Tech Recruitment 2026 అభ్యర్థులకు 01 అక్టోబర్ 2026 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 01 అక్టోబర్ 1999 – 30 సెప్టెంబర్ 2006 మధ్యలో ఉండాలి.

 అప్లికేషన్ ఫీజు (Application Fee)

Indian Army SSC Tech Recruitment 2026 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ (Selection Process)

Indian Army SSC Tech Recruitment 2026  ఎంపిక మొత్తం మెరిట్ & పరీక్షల ఆధారంగా జరుగుతుంది.

  1. Shortlisting – ఇంజినీరింగ్ మార్కుల ఆధారంగా
  2. SSB Interview (2 Stages)
    • Stage-1: Screening Test
    • Stage-2: Psychology, GTO, Interview
  3. Medical Examination
  4. Merit List

జీతం వివరాలు (Salary Details)

Indian Army SSC Tech Recruitment 2026  ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ 49 వారాల పాటు ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పే లెవల్-10 ప్రకారం ₹17–18 లక్షలు వార్షిక ప్యాకేజీతో జీతం ఉంటుంది. 

దరఖాస్తు విధానం (How to Apply)

Indian Army SSC Tech Recruitment 2026 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసకోవాలి. 

  • వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
  • Officer Entry Apply / Login” పై క్లిక్ చేయాలి
  • కొత్తవారు Registration చేయాలి
  • SSC Tech 67 Men నోటిఫికేషన్ ఎంచుకొని అప్లై చేయాలి
  • అన్ని వివరాలు సరిగా నింపి Submit చేయాలి
  • అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి

 ముఖ్య తేదీలు (Important Dates)

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 07 జనవరి 2026
  • దరఖాస్తు చివరి తేది: 05 ఫిబ్రవరి 2026
  • SSB ఇంటర్వ్యూలు: ఏప్రిల్ – జూన్ 2026
  • ట్రైనింగ్ ప్రారంభం: అక్టోబర్ 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : AP Career & Mental Health Counsellors Recruitment 2026 |  ఏపీలో కెరీర్ కౌన్సిలర్ జాబ్స్ –  424 పోస్టులు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!