Indian Army Sports Quota Recruitment 2025 : ఆర్మీ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు విడుదలయ్యాయి. Indian Army Direct Entry Havildar & Naib Subedar (Sports) Intake 05/2025 నోటిఫికేషన్ విడుదలైంది. అంతర్జాతీయ, నేషనల్, కేజీ/యూత్ గేమ్స్‌లో పాల్గొన్న యువ క్రీడాకారులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ సేవతో పాటు ఆకర్షణీయమైన జీతం, ప్రమోషన్ అవకాశాలు, మెడికల్ మరియు పెన్షన్ ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులు పంపాలి.
ఎవరెవరు దరఖాస్తు చేయవచ్చు?
ఈ పోస్టులకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఇద్దరూ అర్హులే. కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వయస్సు 17½ నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 31 మార్చి 2001 నుండి 01 ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాలి.
Also Read : Cabinet Secretariat DFO Recruitment 2025 | క్యాబినెట్ సెక్రటేరియట్ లో బంపర్ జాబ్స్ – 250 పోస్టులు
ఎలాంటి క్రీడలకు అవకాశాలు ఉన్నాయి?
Indian Army Sports Quota Recruitment 2025 లో Athletics, Football, Swimming, Hockey, Wrestling, Boxing, Volleyball, Judo, Kabaddi, Archery, Weightlifting, Basketball, Fencing వంటి పలు క్రీడా విభాగాలకు అవకాశాలు ఉన్నాయి. ప్రతి క్రీడలోని ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ప్రమాణాలు
హవల్దార్ పోస్టుల కోసం నేషనల్ లెవెల్‌లో మెడల్ సాధించి ఉండాలి లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో పాల్గొని ఉండాలి. Naib Subedar పోస్టుల కోసం World Championship, Asian Games, Commonwealth Games వంటి అంతర్జాతీయ పోటీల్లో మెడల్ గెలిచినవారు లేదా ఇండియా తరపున పాల్గొన్నవారు మాత్రమే అర్హులు. Khelo India గేమ్స్‌లో మెడల్ సాధించినవారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది.
ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రమాణాలు
పురుష అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగును 5 నిమిషాలు 45 సెకన్లలో పూర్తి చేయాలి. అలాగే 9 అడుగుల డిచ్ జంప్ మరియు జిగ్-జాగ్ బ్యాలెన్స్ పరీక్షల్లో అర్హత సాధించాలి. మహిళా అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్, హై జంప్ పరీక్షల్లో కూడా అర్హత అవసరం. ఎత్తు ప్రమాణాలు ప్రాంతాల వారీగా మారవచ్చు, ముఖ్యంగా North East ప్రాంతాలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
Indian Army Sports Quota Recruitment 2025 అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ పూర్తిగా స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్ పంపిస్తారు. కాల్ లెటర్ పంపిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను తుది మెరిట్ లిస్ట్‌లో చేర్చుతారు.
జీతం వివరాలు
Indian Army Pay Rules 2017 ప్రకారం Havildar మరియు Naib Subedar పోస్టులకు మంచి జీతం లభిస్తుంది. అదనంగా CSD కాంటీన్, మెడికల్ సదుపాయాలు, పెన్షన్, ట్రావెల్ కన్సెషన్స్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం
Indian Army Sports Quota Recruitment 2025 అభ్యర్థులు దరఖాస్తులను పూర్తిగా ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే పంపాలి. నోటిఫికేషన్ చివర ఇచ్చిన అప్లికేషన్ ఫార్మాట్‌ను A4 సైజ్ పేపర్‌పై ప్రింట్ తీసుకొని సరిగా నింపాలి. ఫోటోలు, విద్యార్హత సర్టిఫికేట్లు, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, కుల, నివాస, క్యారెక్టర్, అన్‌మ్యారిడ్ సర్టిఫికేట్లు వంటి అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి పోస్టు చేయాలి.
పంపాల్సిన చిరునామా:
Directorate of PT & Sports
IHQ of MoD (Army),
Room No 747, A-Wing, Sena Bhawan,
New Delhi – 110011
దరఖాస్తు చివరి తేదీ
- అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ : 15 డిసెంబర్ 2025 (సాయంత్రం 5 గంటల వరకు).
ముఖ్య సూచనలు
అభ్యర్థులు కాల్ లెటర్‌లో ఇచ్చిన తేదీలో ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలి. మొబైల్ ఫోన్లు అనుమతి లేదు. Performance Enhancing Drugs వాడకం పూర్తిగా నిషేధితం. ఏదైనా తప్పుడు డాక్యుమెంట్ సమర్పించినట్లు తేలితే అభ్యర్థిత్వం రద్దు చేసి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు.
| Notification | Click here |
| Application Form | Click here |
FAQs
1. మహిళలు దరఖాస్తు చేయవచ్చా?
అవును. Women Candidates కూడా Havildar/Naib Subedar పోస్టులకు అర్హులే.
2. ఇది All India Recruitmentనా?
అవును. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అర్హులు.
3. What is the selection based on?
Sports Achievements → Physical Test → Skill Test → Medical → Merit.
4. Application Online?
కాదు. పూర్తిగా Offline (Post ద్వారా మాత్రమే).
Also Read : AIIMS CRE-4 Recruitment 2025 | ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్ – 1386 Group-B & C పోస్టులు
3 thoughts on “Indian Army Sports Quota Recruitment 2025 | క్రీడాకారులకు ఆర్మీలో బంపర్ జాబ్స్”