Indian Army NCC special Entry 2025 ఇండియన్ ఆర్మీ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. NCC క్యాడెట్ల కోసం స్పెషల్ ఎంట్రీ స్కీమ్-2025 ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 76 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారిని లెఫ్టినెంట్ లుగా నియమిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ 123వ కోర్సు కోసం NCC క్యాడెట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరి | ఖాళీల సంఖ్య |
NCC(పురుషులు) | 70 (63 జనరల్ + 7 యుద్ధ ప్రమాదాల క్యాజువాలిటీస్) |
NCC(మహిళలు) | 06 (05 జనరల్ + 01 యుద్ధ ప్రమాదాల క్వాజువాలిటీస్) |
మొత్తం | 76 |
అర్హతలు :
Indian Army NCC special Entry 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణ + NCC ‘C’ గ్రేడ్ సర్టిఫికెట్ పరీక్షలో కనీసం ‘B’ గ్రేడ్ పొంది ఉండాలి.
- యుద్ధ ప్రమాదాల క్యాజువాలిటీస్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి NCC ‘C’ సర్టిఫికెట్ అవసరం లేదు.
వయోపరిమితి :
Indian Army NCC special Entry 2025 అభ్యర్థులకు 19 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 02.01.2001 మరియు 01.01.2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. (రెండు తేదీలు కలుపుకొని)
అప్లికేషన్ ఫీజు :
Indian Army NCC special Entry 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian Army NCC special Entry 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్ట్
- SSB ఇంటర్వ్యూ
- మెడికల్ ఎగ్జామినేషన్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
Indian Army NCC special Entry 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ లో నెలకు రూ.56,100/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదా ఇస్తారు.
దరఖాస్తు విధానం :
Indian Army NCC special Entry 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శంచాలి.
- హోమ్ పేజీలో ‘ఆఫీసర్ ఎంట్రీ అప్లయ్/లాగిన్’ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి.
- ‘ఆఫీసర్స్ సెలక్షన్ – ఎలిజిబిలిటీ’ ఓపెన్ అవుతుంది. ‘షార్ట్ సర్వీస్ కమిషన్ Indian Army NCC special Entry కోర్సు పై క్లిక్ చేసి, అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత పరిశీలించుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |