Indian Army JAG Entry 2025 ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జడ్జి అడ్వకేట్ జనరల్ ఎంట్రీ కోసం అవివాహిత పురుషులు మరియు అవివాహిత మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
Indian Army JAG Entry 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ |
పోస్టు పేరు | జడ్జి అడ్వకేట్ జనరల్(JAG) ఎంట్రీ స్కీమ్ – 123వ కోర్సు |
పోస్టుల సంఖ్య | 10 |
దరఖాస్తు ప్రక్రియ (పురుషులు) | 4 ఆగస్టు – 3 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు ప్రక్రియ (మహిళలు) | 5 ఆగస్టు – 4 సెప్టెంబర్, 2025 |
జీతం | లెవల్ 10 – రూ.56,100 – రూ.1,77500/- |
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఆర్మీ జడ్జి అడ్వకేట్ జనరల్ ఎంట్రీ స్కీమ్ 123వ కోర్సు కోసం అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పురుషులకు : 05 పోస్టులు
- మహిళలకు :05 పోస్టులు
అర్హతలు :
Indian Army JAG Entry 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.
- కనీసం 55% మార్కులతో లా డిగ్రీ (లేదా) ఇంటర్ తర్వాత ఐదేళ్ల కోర్సు
- అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా / స్టేట్ లో న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి అర్హులు అయి ఉండాలి.
వయోపరిమితి :
Indian Army JAG Entry 2025 అభ్యర్థులకు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 2 జనవరి, 1999 కంటే ముందు మరియు 1 జనవరి, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలుపుకొని)
శారీరక/ మెడికల్ రిక్వైర్మెంట్ :
పురుషులకు :
- 10 నిమిషాల 30 సెకన్లలో 2.4 కి.మీ. పరుగు
- సిట్ అప్స్ – 30
- పుష్ అప్స్ – 40
- క్రాస్ గ్రిప్ – 04-06
- స్క్వాట్స్ – 30 ( రెండు సెట్లు)
- లంజస్ – 10 ( రెండు సెట్లు)
- స్విమ్మింగ్ – ఏ స్ట్రోక్ లో నైనా 25 మీటర్లు ఈత కొట్టాలి
మహిళలకు :
- 13 నిమిషాల్లో 2.4 కి.మీ. పరుగు
- సిట్ అప్స్ – 25
- పుష్ అప్స్ – 15
- క్రాస్ గ్రిప్ – 02
- స్క్వాట్స్ – 30 ( రెండు సెట్లు)
- లంజస్ – 10 ( రెండు సెట్లు)
- స్విమ్మింగ్ – ఏ స్ట్రోక్ లో నైనా 25 మీటర్లు ఈత కొట్టాలి
అప్లికేషన్ ఫీజు :
Indian Army JAG Entry 2025 అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian Army JAG Entry 2025 పోస్టులకు కింది దశల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్ట్
- SSB ఇంటర్వ్యూ
- మెడికల్ టెస్ట్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
Indian Army JAG Entry 2025 ఇండియన్ ఆర్మీలో జడ్జి అడ్వకేట్ జనరల్ ఆఫీసర్ గా ఎంపికైన వారికి పే లెవల్ 10 ప్రకారం రూ.56,100 నుంచి రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Indian Army JAG Entry 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో ‘ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్/ లాగిన్’ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయి అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- ‘SSC JAG Entry Course’ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ (పురుషులకు) : 04 ఆగస్టు – 03 సెప్టెంబర్, 2025
- దరఖాస్తు ప్రక్రియ (మహిళలకు) : 05 ఆగస్టు – 04 సెప్టెంబర్, 2025
- ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తేదీలు : నవంబర్ / డిసెంబర్, 2025
- కోర్సు ప్రారంభం : ఏప్రిల్ 2026
Notification (Male) | Click here |
Notification (Female) | Click here |
Apply Online | Click here |
Hi