Indian Air Force Group C Jobs 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ‘సి’ జాబ్ నోటిఫికేషన్

Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికషన్ విడుదల చేయడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హిందీ టైపిస్ట్, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు దరఖస్తులు సమర్పించుకోవచ్చు.  

Indian Air Force Group C Jobs 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

పోస్టు పేరుఖాళీల సంఖ్య
లోయర్ డివిజన్ క్లర్క్(LDC)14
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)53
హిందీ టైపిస్ట్02
స్టోర్ కీపర్16
కుక్12
కార్పెంటర్03
పెయింటర్03
మెస్ స్టాఫ్07
హౌస్ కీపింగ్ స్టాఫ్31
లాండ్రీ మ్యాన్03
వల్కనైజర్01
డ్రైవర్08

అర్హతలు : 

Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి ఉద్యోగాలకు పోస్టును అనుసరించి అర్హతలు మారుతాయి. 

పోస్టు పేరువిద్యార్హతలు
లోయర్ డివిజన్ క్లర్క్ మరియు హిందీ టైపిస్ట్ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 
మల్టీ టాస్కింగ్ స్టాఫ్10వ తరగతి ఉత్తీర్ణత
డ్రైవర్10వ తరగతి ఉత్తీర్ణత మరియు 2 సంవత్సరాల అనుభవంతో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
హౌస్ కీపింగ్ స్టాఫ్10వ తరగతి ఉత్తీర్ణత
స్టోర్ కీపర్10+2 ఉత్తీర్ణత
కుక్10వ తరగతి ఉత్తీర్ణత + క్యాటరింగ్ లో సర్టిఫికెట్ + 1 సంవత్సరం అనుభవం
పెయింటర్పెయింటర్ ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్
కార్పెంటర్కార్పెంటర్ ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్
లాండ్రీ మెన్ 10వ తరగతి ఉత్తీర్ణత
మెస్ స్టాఫ్10వ తరగతి ఉత్తీర్ణత
వల్కనైజర్10వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 

Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

Indian Air Force Group C Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్టును అనుసరించి వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-1 మరియు లెవల్-2 ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

Indian Air Force Group C Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలను జత చేయాలి. 
  • సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ తో రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించాలి.
  • అప్లికేషన్ ఫారమ్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 17 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 15 – 06 – 2025 సాయంత్రం 5 గంటల వరకు

Notification : CLICK HERE

Application Form : Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!