Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికషన్ విడుదల చేయడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హిందీ టైపిస్ట్, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు దరఖస్తులు సమర్పించుకోవచ్చు.
Indian Air Force Group C Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
లోయర్ డివిజన్ క్లర్క్(LDC) | 14 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 53 |
హిందీ టైపిస్ట్ | 02 |
స్టోర్ కీపర్ | 16 |
కుక్ | 12 |
కార్పెంటర్ | 03 |
పెయింటర్ | 03 |
మెస్ స్టాఫ్ | 07 |
హౌస్ కీపింగ్ స్టాఫ్ | 31 |
లాండ్రీ మ్యాన్ | 03 |
వల్కనైజర్ | 01 |
డ్రైవర్ | 08 |
అర్హతలు :
Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి ఉద్యోగాలకు పోస్టును అనుసరించి అర్హతలు మారుతాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
లోయర్ డివిజన్ క్లర్క్ మరియు హిందీ టైపిస్ట్ | ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 10వ తరగతి ఉత్తీర్ణత |
డ్రైవర్ | 10వ తరగతి ఉత్తీర్ణత మరియు 2 సంవత్సరాల అనుభవంతో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ |
హౌస్ కీపింగ్ స్టాఫ్ | 10వ తరగతి ఉత్తీర్ణత |
స్టోర్ కీపర్ | 10+2 ఉత్తీర్ణత |
కుక్ | 10వ తరగతి ఉత్తీర్ణత + క్యాటరింగ్ లో సర్టిఫికెట్ + 1 సంవత్సరం అనుభవం |
పెయింటర్ | పెయింటర్ ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ |
కార్పెంటర్ | కార్పెంటర్ ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ |
లాండ్రీ మెన్ | 10వ తరగతి ఉత్తీర్ణత |
మెస్ స్టాఫ్ | 10వ తరగతి ఉత్తీర్ణత |
వల్కనైజర్ | 10వ తరగతి ఉత్తీర్ణత |
వయస్సు:
Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
Indian Air Force Group C Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్టును అనుసరించి వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
Indian Air Force Group C Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-1 మరియు లెవల్-2 ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Indian Air Force Group C Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను జత చేయాలి.
- సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ తో రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 17 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 – 06 – 2025 సాయంత్రం 5 గంటల వరకు
Notification : CLICK HERE