India Post GDS Recruitment 2026 : గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇండియా పోస్టు తీసుకొచ్చిన ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. Department of Posts ద్వారా Gramin Dak Sevak (GDS) పోస్టుల భర్తీకి January 2026 నోటిఫికేషన్ విడుదలైంది. BPM, ABPM, Dak Sevak పోస్టులకు రాత పరీక్ష లేకుండా, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) మరియు Dak Sevak పోస్టులను భర్తీ చేయనున్నారు. సురుమారు 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలు రాష్ట్రం, డివిజన్, పోస్టాఫీస్ వారీగా ఉన్నాయి.
అర్హతలు (Educational Qualification)
India Post GDS Recruitment 2026 అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. గణితం మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్పనిసరి. దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ 10వ తరగతి వరకు చదివి ఉండాలి. ప్రాథమిక కంప్యూటర్ జ్ఞానం, సైకిల్ తొక్కగల సామర్థ్యం ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
India Post GDS Recruitment 2026 దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు – గరిష్టంగా 10–15 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
India Post GDS Recruitment 2026 సాధారణ అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
మహిళలు, SC, ST, PwBD మరియు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
India Post GDS Recruitment 2026 ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా తయారు చేసే మెరిట్ లిస్ట్ ద్వారా జరుగుతుంది. టై వచ్చినప్పుడు వయస్సు, కేటగిరీ, లింగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
జీతం వివరాలు (Salary Details)
India Post GDS Recruitment 2026 GDS ఉద్యోగులకు Time Related Continuity Allowance (TRCA) చెల్లిస్తారు.
- BPM: ₹12,000 – ₹29,380
- ABPM / Dak Sevak: ₹10,000 – ₹24,470
దీనితో పాటు DA, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ప్రతి సంవత్సరం 3% వార్షిక పెరుగుదల ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
India Post GDS Recruitment 2026 అభ్యర్థులు indiapost.gov.in/gdsonlineengagement వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ముందుగా One Time Registration (OTR) చేయాలి. తరువాత లాగిన్ అయి అప్లికేషన్ ఫారం నింపాలి. ఫోటో, సంతకం అప్లోడ్ చేసి అవసరమైతే ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 2 రోజుల ఎడిట్ విండో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం : 30 జనవరి, 2026
- చివరి తేదీ : 14 ఫిబ్రవరి, 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Railway Level-1 Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,195 పోస్టులు