India Post GDS Recruitment 2025 పోస్టల్ శాఖ నుంచి GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 21,413 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన వారు దరఖాాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
India Post GDS Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియా పోస్టు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు దేశవ్యాప్తంగా 21,413 ఉన్నాయి.
-ఆంధ్రప్రదేశ్ – 1215 పోస్టులు
-తెలంగాణ – 519 పోస్టులు
అర్హతలు:
India Post GDS Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
AP Forest Jobs Update | ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలపై తాజా అప్ డేట్ | 689 పోస్టుల భర్తీ
వయస్సు:
India Post GDS Recruitment 2025 ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
India Post GDS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఎటువంటి ఫీజు ఉండదు.
జీతం :
India Post GDS Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM)కు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.20,000/- వరకు జీతం ఉంటుంది. అసిస్టెంబ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) కు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.18,000/- వరకు జీతం అయితే రావడం జరుగుతుంది.
ఎంపిక ప్రక్రియ :
India Post GDS Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
India Post GDS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు India Post అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 – 02 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 03 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
Hai