India Post Driver Recruitment 2026 : పోస్టల్ డిపర్ట్మెంట్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Staff Car Driver (Ordinary Grade) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అహ్మదాబాద్ లోని మెయిల్ మోటార్ సర్వీస్ లోని సీనియర్ మేనేజర్ కింద స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించుకోవాలి.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కాబట్టి దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంపికైన తర్వాత పోస్టింగ్ మాత్రం గుజరాత్ సర్కిల్ లోనే అంటే అహ్మదాబాద్ సహా గుజరాత్ లోని వివిధ డివిజన్లు లేదా యూనిట్లలో పోస్టింగ్ ఉంటుంది.
ఖాళీల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 Staff Car Driver పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు గుజరాత్ సర్కిల్‌లోని వివిధ డివిజన్‌లు/యూనిట్లలో ఉన్నాయి.
- పోస్టు పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్
- మొత్తం పోస్టుల సంఖ్య : 48
Also Read : IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 501 ఖాళీలు
అర్హతలు :
India Post Driver Recruitment 2026 అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే లైట్/హెవీ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ వాహన డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన ట్రేడ్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ అర్హతను పొందాలి.
వయోపరిమితి :
India Post Driver Recruitment 2026 అభ్యర్థులకు 19 జనవరి 2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
India Post Driver Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు స్కిల్ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు.
- డ్రైవింగ్ స్కిల్ టెస్ట్
- ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
India Post Driver Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-2 ప్రకారం రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
India Post Driver Recruitment 2026 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన Annexure-I ప్రొఫార్మాలో అప్లికేషన్ నింపాలి. అవసరమైన సర్టిఫికేట్ల కాపీలు జత చేయాలి. అప్లికేషన్ ని కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి.
చిరునామా :
- Senior Manager, Mail Motor Service, GPO Compound, Ahmedabad – 380001
- చివరి తేదీ : 19 జనవరి, 2026
| Notification & Application | Click here |
Also Read : Railway RRB Group D Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు