INDBANK Recruitment 2025: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్(IBMBS LTD) స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ కోసం డీలర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీలర్ ఫర్ స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు మార్చి 1వ తేదీ లోపు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన లో ఇవ్వబడ్డాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
INDBANK Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ కోసం డీలర్ పోస్టుల నియామకాల చేపడుతున్నారు. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
INDBANK Recruitment 2025 డీలర్ – స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NIMS అర్హతతో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
వయస్సు :
INDBANK Recruitment 2025 డీలర్ – స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
BOB Caps Recruitment 2025| డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ జాబ్స్
జీతం :
INDBANK Recruitment 2025 డీలర్ – స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.50 లక్షలు వార్షిక జీతం చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
INDBANK Recruitment 2025 డీలర్ స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేసి వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
INDBANK Recruitment 2025 డీలర్ స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని సంబంధిత డాక్యుమెంట్స్ జత చేసి కొరియర్ లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
Head Administration No 480,
1st Floor Khivraj Complex I,
Anna Salai,
Nandanam Chennai-35.
అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా కూడా దరఖాస్తును పంపవచ్చు. అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ని స్కాన్ చేసి ఆ కాపీని recruitment@indbankonline.com కు మెయిల్ చేయాలి.
చివరి తేదీ : 01 – 03 – 2025
Notification : CLICK HERE
Application : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “INDBANK Recruitment 2025 | INDBANK లో డీలర్ పోస్టులు”