Income Tax Recruitment 2025 హైదరాబాాద్ లోని ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 56 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోగలరు.
Income Tax Hyderabad Recruitment 2025
పోస్టుల వివరాలు :
హైదరాబాద్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో స్పోర్ట్స్ కోటా కింద ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 56 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 56
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ట్యాక్స్ అసిస్టెంట్ | 28 |
స్టెనో గ్రాఫర్ గ్రేడ్-II | 02 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 26 |
అర్హతలు :
Income Tax Hyderabad Recruitment 2025 ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్ కోటా కింద భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన క్రీడల్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
ట్యాక్స్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ + స్పోర్ట్స్ సర్టిఫికెట్ |
స్లెనో గ్రాఫర్ గ్రేడ్-II | ఇంటర్ + స్పోర్ట్స్ సర్టిఫికెట్ |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 10వ తరగతి + స్పోర్ట్స్ సర్టిఫికెట్ |
వయస్సు:
Income Tax Hyderabad Recruitment 2025 ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
Income Tax Hyderabad Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
Income Tax Hyderabad Recruitment 2025 ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు వచ్చిన అప్లికేషన్లు పరీశీలించి స్పోర్ట్స్ ట్రయల్స్ / ఫిజికల్ టెస్ట్ కు పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది.
జీతం:
Income Tax Hyderabad Recruitment 2025 ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కింద ఇచ్చిన విధంగా జీతాలు చెల్లిస్తారు.
పోస్టు పేరు | జీతం |
ట్యాక్స్ అసిస్టెంట్ | రూ.25,500 – రూ.81,100 |
స్టెనోగ్రాఫర్ | రూ.25,500 – రూ.81,100 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | రూ.18,000 – రూ.56,900 |
దరఖాస్తు విధానం:
Income Tax Hyderabad Recruitment 2025 పోస్టులకు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా చదివి ఫారమ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం | 15 – 03 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 05 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |