IIT Tirupati Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IIT Tirupati Recruitment 2025 Overview :
| నియామక సంస్థ | ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి |
| పోస్టు పేరు | అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ |
| పోస్టుల సంఖ్య | 42 |
| దరఖాస్తు ప్రక్రియ | 14 జులై – 13 ఆగస్టు, 2025 |
| దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
| జాబ్ లొకేషన్ | తిరుపతి |
పోస్టుల వివరాలు :
తిరుపతిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల వివరాలు :
గ్రూప్-ఎ పోస్టులు:
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 01 (డిప్యూటేషన్)
- టెక్నికల్ ఆఫీసర్ : 01
- సెక్యూరిటీ ఆఫీసర్ : 01
గ్రూప్ – బి పోస్టులు :
- సెక్షన్ ఆఫీసర్ : 02
- జూనియర్ సూపరింటెండెంట్ : 07
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) : 01
- జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ : 01
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ : 06
గ్రూప్- సి పోస్టులు :
- జూనియర్ అసిస్టెంట్ : 12
- జూనియర్ టెక్నీషియన్ : 10
అర్హతలు :
IIT Tirupati Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
గ్రూప్-ఎ పోస్టులు:
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : మాస్టర్ డిగ్రీ + 8 సంవత్సరాల అనుభవం
- టెక్నికల్ ఆఫీసర్ : BE / B.Tech + 8 ఏళ్ల అనుభవం (లేదా) ME / M.Tech + 5 ఏళ్ల అనుభవం (లేదా) సంబంధిత విభాగంలో P.hD + అనుభవం లేదు.
- సెక్యూరిటీ ఆఫీసర్ : బ్యాచిలర్ డిగ్రీ + 10 సంవత్సరాల అనుభవం
గ్రూప్ – బి పోస్టులు :
- సెక్షన్ ఆఫీసర్ : బ్యాచిలర్ డిగ్రీ + 7 ఏళ్ల అనుభవం (లేదా) మాస్టర్ డిగ్రీ + 3 ఏళ్ల అనుభవం
- జూనియర్ సూపరింటెండెంట్ : బ్యాచిలర్ డిగ్రీ + 4 ఏళ్ల అనుభవం (లేదా) మాస్టర్ డిగ్రీ + 3 ఏళ్ల అనుభవం
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) : సివిల్ ఇంజినీరింగ్ లో BE / B.Tech + 2 ఏళ్ల అనుభవం (లేదా) సివిల్ లో డిప్లొమా + 5 ఏళ్ల అనుభవం
- జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ : ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ + 3 ఏళ్ల అనుభవం
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ : బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎంఎస్సీ + 2 ఏళ్ల అనుభవం
గ్రూప్- సి పోస్టులు :
- జూనియర్ అసిస్టెంట్ : బ్యాచిలర్ డిగ్రీ
- జూనియర్ టెక్నీషియన్ : సంబంధిత విభాగాల్లో BE /B.Tech
వయోపరిమితి :
IIT Tirupati Recruitment 2025 గ్రూప్ – ఎ పోస్టులకు 45 సంవత్సరాల వరకు మరియు గ్రూప్-బి పోస్టులకు 35 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి.
- గ్రూప్- సి పోస్టులకు : 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IIT Tirupati Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి.
| పోస్టు పేరు | ఫీజు |
| గ్రూప్ – ఎ | రూ.500/- |
| గ్రూప్ – బి | రూ.300/- |
| గ్రూప్ – సి | రూ.200/- |
| SC / ST / PwBD / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలు / ట్రాన్స్ జెండర్ | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
IIT Tirupati Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- ఆబ్జెక్టివ్ టెస్ట్
- డిస్క్రిప్టివ్ టెస్ట్
- స్కిల్ టెస్ట్
జీతం వివరాలు :
IIT Tirupati Recruitment 2025 పోస్టును బట్టి జీతాలు ఇవ్వబడతాయి. పే స్కేల్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- గ్రూప్ – ఎ పోస్టులకు : రూ.56,100 – రూ.1,77,500/-
- గ్రూప్ – బి పోస్టులకు : రూ.35,400 – రూ.1,51,100/-
- గ్రూప్ – సి పోస్టులకు : రూ.25,500 – రూ.81,100/-
దరఖాస్తు విధానం :
IIT Tirupati Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 13 ఆగస్టు, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |