IIT Madras Non-Teaching Recruitment 2025: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) మద్రాస్ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే ఇలాంటి ఉద్యోగాలకు పోటీ తక్కువగా ఉంటుంది.

IIT Madras Non-Teaching Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ |
పోస్టు పేర్లు | డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు |
పోస్టుల సంఖ్య | 37 |
దరఖాస్తు ప్రక్రియ | 27 సెప్టెంబర్ – 26 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | చెన్నై, తమిళనాడు |
Also Read : NIT Manipur Non Teaching Recruitment 2025 | నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
Vacancy Details:
భారత దేశంలో అగ్రశ్రేణి ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ అయిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 37 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డిప్యూటీ రిజిస్ట్రార్ | 1 |
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ | 8 |
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 1 |
HVAC ఆఫీసర్ | 1 |
టెక్నికల్ ఆఫీసర్ | 1 |
అసిస్టెంట్ రిజిస్ట్రార్ | 3 |
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 1 |
జూనియర్ ఇంజనీర్ | 9 |
జూనియర్ అసిస్టెంట్ | 12 |
అర్హతలు :
IIT Madras Non-Teaching Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతాయి.
- డిప్యూటీ రిజిస్ట్రార్ : కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ : సివిల్, మెకానికల్, ఎలక్ట్రిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదా కెమిస్ట్రీలో 55 శాతం మార్కులతో ME / M.Tech లేదాBE / B.Tech / MSc + ఎంటెక్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు B.Tech / MSc అభ్యర్థులకు 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత + 8 సంవత్సరాల అనుభవం
- HVAC ఆఫీసర్ : మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ + సంబంధిత రంగంలో 15 సంవత్సరాల సేవ.
- టెక్నికల్ ఆఫీసర్ : 5 సంవత్సరాల ఫిజియోథెరపీ / ఆక్యుపేషనల్ థెరపీలో మాస్టర్స్ డిగ్రీ లేదా 8 సంవత్సరాల సంబంధిత అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ.
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ మరియు పరిపలన / ఫైనాన్స్ లో అనుభవం
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : ME / M.Tech లేదా BE / B.Tech + M.Tech అభ్యర్థులకు 5 సంవత్సరాలు లేద B.Tech అభ్యర్థులకు 8 సంవత్సరాలు అనుభవం అవసరం.
- జూనియర్ ఇంజనీర్ : సివిల్, ఎలక్ట్రికల్ లేదా రిఫ్రిజిరేష్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లో బ్యాచిలర్ లేదా డిప్లొమా మరియు అవసరమైన అనుభవం.
- జూనియర్ అసిస్టెంట్ : 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు కంప్యూటర్ ఆపరేషన్స్ నాలెడ్జ్.
వయోపరిమితి :
IIT Madras Non-Teaching Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- డిప్యూటి రిజిస్ట్రార్ : 50 సంవత్సరాలు
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ : 50 సంవత్సరాలు
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : 56 సంవత్సరాలు
- HVAC ఆఫీసర్ : 45 సంవత్సరాలు
- టెక్నికల్ ఆఫీసర్ : 45 సంవత్సరాలు
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 45 సంవత్సరాలు
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ : 45 సంవత్సరాలు
- జూనియర్ ఇంజనీర్ : 32 సంవత్సరాలు
- జూనియర్ అసిస్టెంట్ : 27 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
IIT Madras Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- గ్రూప్-ఎ పోస్టులకు : రూ.1,200/-
- గ్రూప్-బి మరియు గ్రూప్-సి : రూ.600/-
- ఎస్సీ/ ఎస్టీ / దివ్యాంగ / మహిళా అభ్యర్థులకు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
IIT Madras Non-Teaching Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ / ప్రొఫెషనల్ కాంపిటెన్స్ టెస్ట్
- ఇంటర్వ్యూ
Also Read : ISRO VSSC Driver Notification 2025 | ఇస్రోలో డ్రైవర్, కుక్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
IIT Madras Non-Teaching Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి లెవల్-3 నుంచి లెవల్-12 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
IIT Madras Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు IIT Madras Recruitment వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : VISMUSEUM Recruitment 2025 | మ్యూజియంలో అసిస్టెంట్ పోస్టులు