IIBF JE Recruitment 2025 : బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వారికి ఇది మంచిఛాన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (IIBF) 2025 సంవత్సరానికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో మంచిన జీతం, మంచి కెరీర్ గ్రోత్ ఇస్తాయి. ప్రారంభ పోస్టింగ్ ముంబైలో ఉంటుంది.
Overview
- సంస్థ: Indian Institute of Banking & Finance
- పోస్ట్: Junior Executive
- ఖాళీలు: 10
- అప్లికేషన్ మోడ్: Online
- చివరి తేదీ: 12 డిసెంబర్ 2025
- ఎగ్జామ్ తేదీ: 28 డిసెంబర్ 2025
- ప్రారంభ జీతం: ₹8.7 లక్షలు వార్షికం
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయబడతాయి. అవసరాన్ని బట్టి పోస్టుల సంఖ్య మారవచ్చు.
- పోస్టు పేరు : జూనియర్ ఎగ్జిక్యూటివ్
- పోస్టుల సంఖ్య : 10
Also Read : CSIR–IHBT Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులు
అర్హతలు (Educational Qualifications)
IIBF JE Recruitment 2025 పోస్ట్‌కు సంబంధించి కనీస విద్యార్హత:
- Commerce / Economics / Business Management / IT / Computer Science / Computer Applications విభాగాల్లో 60% మార్కులతో గ్రాడ్యుయేషన్
- M.Com, MA (Economics), MBA, CA, CMA, CS, CFA ఉంటే అదనపు ప్రయోజనం
వయోపరిమితి (Age Limit)
IIBF JE Recruitment 2025 అభ్యర్థులకు 01.11.2025 నాటికి గరిష్ట వయసు 28 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
IIBF JE Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹700 + GST చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
IIBF JE Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
1. ఆన్‌లైన్ ఎగ్జామ్
ఎగ్జామ్‌లో మొత్తం 200 ప్రశ్నలు – 200 మార్కులు – 140 నిమిషాలు
| పరీక్ష | ప్రశ్నలు | మార్కులు | టైమ్ |
| Reasoning | 50 | 50 | 40 నిమి |
| English Language | 40 | 40 | 30 నిమి |
| Quantitative Aptitude | 50 | 50 | 40 నిమి |
| General Awareness (Banking) | 40 | 40 | 20 నిమి |
| Computer Knowledge | 20 | 20 | 10 నిమి |
- ప్రతి తప్పు ప్రశ్నకు 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
2. వ్యక్తిగత ఇంటర్వ్యూ
- ఆన్‌లైన్ పరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు (Salary Details)
IIBF JE Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్: ₹40,400 – ₹1,30,400/-
- ప్రారంభ ప్యాకేజ్: ₹8.7 లక్షలు వార్షికం (CTC)
- అదనంగా DA, HRA, మెడికల్, లీజ్ రెంట్ (₹18,000 – ₹20,000), లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి.
జాబ్ ప్రొఫైల్ (Job Profile)
- ఇనిస్టిట్యూట్ కార్యాలయాల్లో ఫ్రంట్ లైన్ అధికారిగా పనిచేయాలి.
- సభ్యుల ప్రశ్నలకు స్పందించాలి.
- అడ్మిన్ & అకాడెమిక్ డిపార్ట్‌మెంట్ పనులను చూడాలి.
- డేటా మేనేజ్‌మెంట్ & ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేయాలి.
పోస్టింగ్ వివరాలు
ప్రారంభ పోస్టింగ్ ముంబైలో ఉంటుది. అయితే అవసరాన్ని బట్టి ఇతర నగరాలకు ట్రాన్స్‌ఫర్ అవుతారు.
- ప్రస్తుతం IIBF కార్యాలయాలు: Delhi, Kolkata, Chennai, Mumbai, Guwahati
దరఖాస్తు విధానం (How to Apply)
IIBF JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- www.iibf.org.in వెళ్లాలి → Careers ట్యాబ్ ఓపెన్ చేయాలి.
- “Apply Online” క్లిక్ చేస్తే IBPS పేజీకి వెళ్తుంది.
- “New Registration” చేసి వివరాలు ఇవ్వాలి.
- ఫోటో, సిగ్నేచర్, thumb impression, declaration స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ₹700 + GST ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- ఫార్మ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం : 28 Nov 2025
- చివరి తేదీ : 12 Dec 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RITES Assistant Manager Recruitment 2025 | RITES భారీ నోటిఫికేషన్ – 400 పోస్టులు