IFSCA Recruitment 2025: ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(IFSCA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

IFSCA Recruitment 2025 Overview
| నియామక సంస్థ | ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(IFSCA) |
| పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఎ) |
| పోస్టుల సంఖ్య | 20 |
| దరఖాస్తు ప్రక్రియ | 11 సెప్టెంబర్ – 25 సెప్టెంబర్, 2025 |
| దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : RRC SR Sports Quota Recruitment 2025 | దక్షిణ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నుంచి అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంద. జనరల్, లీగల్ మరయు ఐటీ స్ట్రీమ్స్ లలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశ ఆర్థిక నియంత్రణ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
| పోస్టు పేరు | ఖాళీలు |
| గ్రేడ్ – ఎ జనరల్ స్ట్రీమ్ | 12 |
| గ్రేడ్ – ఎ లీగల్ | 04 |
| గ్రేడ్ – ఎ ఐటీ | 04 |
| మొత్తం | 20 |
అర్హతలు:
IFSCA Recruitment 2025 పోస్టు స్ట్రీమ్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి.
- జనరల్ : స్టాటిస్టక్స్ / ఎకనామిక్స్ / కామర్స్ / బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్(ఫైనాన్స్) / ఎకనామెట్రిక్స్ లో మాస్టర్ డిగ్రీ లేదా CA / CFA / CS / ICWA లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / ఎంసీఏ / ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా లాలో బ్యాచిలర్ డిగ్రీ.
- లీగల్ : లాలో బ్యాచిలర్ డిగ్రీ
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / ఎంసీఏ / ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ.
వయోపరిమితి :
IFSCA Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IFSCA Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / OBC / EWS : రూ.1,000/-
- SC / ST / PWD : రూ.100/-
ఎంపిక ప్రక్రియ :
IFSCA Recruitment 2025 గ్రేడ్-ఎ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ప్రిలిమ్స్ రాత పరీక్ష
- మెయిన్స్ రాత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు :
IFSCA Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.62,500/- ఉంటుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం :
IFSCA Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేయాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 25.09.2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RBI Grade B Notification 2025 | నెలకు రూ.1.5 లక్షల భారీ జీతంతో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలు