IDBI JAM Recruitment 2025 | డిగ్రీ అర్హతతో IDBI బ్యాంకులో 650 పోస్టులు

IDBI JAM Recruitment 2025 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నుంచి ఉద్యోగాల నియమాకాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్టుల పెట్టుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు ఉన్న వారు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

IDBI JAM Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ప్రభుత్వ బ్యాంక్ సంస్థ అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

అర్హతలు : 

IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.. 

వయస్సు : 

IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు : 

IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.1050/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేేసి ఉద్యోగం ఇస్తారు. 

  • ఆన్ లైన్ రాత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ట్రైనింగ్ మరియు జీతం : 

IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్)’ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో ఆరు నెలలు క్లాస్ రూమ్ బోధన, తర్వాత రెండు నెలలు ఇంటర్న్ షిప్, నాలుగు నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఏడాది పాటు ట్రైనింగ్ లో స్టైఫండ్ ఇస్తారు. ఆ తర్వాత ఉద్యోగంలో జాాయిన్ అయిన తర్వాత ₹6.50 LPA ఏడాది ప్యాకేజీతో జీతం ఇస్తారు. ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖస్తు విధానం : 

IDBI JAM Recruitment 2025 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఫొటో, సంతకం, చెల్లుబాటు అయ్యే ఐడీ తదితర డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 మార్చి 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివర తేదీ : 12 మార్చి 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

1 thought on “IDBI JAM Recruitment 2025 | డిగ్రీ అర్హతతో IDBI బ్యాంకులో 650 పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!