ICMR RMRCSVP Recruitment 2025 |  డిగ్రీ అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు

ICMR RMRCSVP Recruitment 2025 : రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, శ్రీ విజయపురం నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిక పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు లింక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ICMR RMRCSVP Recruitment 2025

పోస్టుల వివరాలు : 

మొత్తం పోస్టుల సంఖ్య : 06

● అసిస్టెంట్ – 02

● అప్పర్ డివిజన్ క్లర్క్ – 02

● లోయర్ డివిజన్ క్లర్క్ – 02

అర్హతలు : 

ICMR RMRCSVP Recruitment 2025 అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు టైపింగ్ స్కిల్స్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేేసి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

Also Read : INDBANK Recruitment 2025 | INDBANK లో డీలర్ పోస్టులు

వయస్సు : 

ICMR RMRCSVP Recruitment 2025 అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

ICMR RMRCSVP Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే UR / OBC / EWS  అభ్యర్థులు రూ.2000/- మరియు ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.1600/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

ICMR RMRCSVP Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేేస్తారు. 

జీతం : 

ICMR RMRCSVP Recruitment 2025 అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.50,000/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.  

దరఖాస్తు విధానం : 

ICMR RMRCSVP Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. ఆన్ లైన్ అప్లయ్ తేదీ ప్రకటించిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు : 

ICMR RMRCSVP Recruitment 2025 ఉద్యోగాలకు ఆన్ లైన్ అప్లికేషన్ తేదీలను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తారు. మీరు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించుకోండి.. 

Notification : CLICK HERE

Official Website : CLICK HERE

3 thoughts on “ICMR RMRCSVP Recruitment 2025 |  డిగ్రీ అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!