ICFRE TRFI Recruitment 2025 జబల్పూర్ లోని ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ICFRE TRFI Group C Recruitment 2025 Overview :
నియామక సంస్థ | ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూ |
పోస్టుల పేర్లు | టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్, డ్రైవర్ |
పోస్టుల సంఖ్య | 14 |
దరఖస్తుల ప్రక్రియ | 14 జూలై – 10 ఆగస్టు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | జబల్పూర్, ఇండియాలోని ICFRE సెంటర్లలో |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వంలోని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న భారతీయ పౌరులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
టెక్నికల్ అసిస్టెంట్(కేగటిరీ 2- ఫీల్డ్/ల్యాబ్) | 10 |
ఫారెస్ట్ గార్డ్ | 03 |
డ్రైవర్ | 01 |
అర్హతలు :
ICFRE TRFI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
టెక్నికల్ అసిస్టెంట్ | బోటనీ / జువాలజీ / అగ్రికల్చర్ / ఫారెస్ట్రీ / బయోటెక్నాలజీ / కెమిస్ట్రీ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ / స్టాటిస్టిక్స్ లో BSc |
ఫారెస్ట్ గార్డ్ | సైన్స్ తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రొబేషన్ సమయంలో ఫారెస్ట్రీ శిక్షణ పూర్తి చేయాలి. |
డ్రైవర్ | 10వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్ + 3 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్. మోటార్ మెకానిజమ్ నాలెడ్జ్ ప్రాధాన్యత |
వయోపరిమితి :
ICFRE TRFI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ : 21 నుంచి 30 సంవత్సరాలు
- ఫారెస్ట్ గార్డ్ & డ్రైవర్ : 18 నుంచి 27 సంవత్సరాలు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
ICFRE TRFI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జనరల్ / ఓబీసీ : రూ.850/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
ICFRE TRFI Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- ట్రేడ్ టెస్ట్
- ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
పరీక్ష కేంద్రాలు :
అహ్మదాబాద్, జబల్పూర్, బెంగళూరు, జైపూర్, భోపాల్, కోల్ కతా, భువనేశ్వర్, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, కోయంబత్తూరు, పాట్నా, డెహ్రాడూన్, ప్రయాగ్ రాజ్, గౌహతి, రాయ్ పూర్, హైదరాబాద్, రాంచీ
జీతం వివరాలు :
ICFRE TRFI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ : 7వ సీపీసీ యొక్క లెవల్-5 ప్రకారం రూ.29,200 – 92,300/-
- ఫారెస్ట్ గార్డ్ / డ్రైవర్ : 7వ సీపీసీ యొక్క లెవల్-2 ప్రకారం రూ.19,900 – రూ.63,200/-
దరఖాస్తు విధానం:
ICFRE TRFI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ విభాగంలోకి వెళ్లాలి.
- Group C Recruitment 2025 వద్ద అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |