ICAR Agriculture Notification:
ICAR సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన పీల్డ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరీ ఈ పోస్టుల యొక్క వివరాలను తెలుసుకుందాం..
పోస్టు వివరాలు మరియు అర్హతలు:
ICAR సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి పీల్డ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేయనున్నారు. 01 పోస్టు మాాత్రమే ఉంది. ఇది కంట్రాక్ట్ బేసిక జాబ్. సైన్స్ డిపార్ట్ మెంట్ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హలు.
వయస్సు:
ICAR CTCRI పీల్డ్ లేదా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే వారి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఎంపిక విధానం:
అర్హులైన అభ్యర్థులు 05 ఫిబ్రవరి 2025 తేదీన ఒడిశాలోని భువనేశ్వరలో ఉన్న సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
జీతం ఎంత:
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000-/ జీతం అయితే ఉంటుంది. ఇతర అలవెన్సులు ఇవ్వరు.
ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు:
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫార్మట్ లో బయోడేటాను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక జత అటెస్టెడ్ చేసిన జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. అలాగే ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.