IBPS PO/MT Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 1వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
IBPS PO/MT Recruitment 2025 overview :
నియామక సంస్థ | ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) |
పోస్టు పేరు | ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ |
ఖాళీల సంఖ్య | 5,208 |
జాబ్ లొకేషన్ | పాన్ ఇండియా |
పోస్టుల వివరాలు :
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బ్యాంకుల వారీగా ఖాళీలు :
బ్యాంకు పేరు | ఖాళీలు |
బ్యాంక్ ఆఫ్ బరోడా | 1,000 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 700 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 1000 |
కెనరా బ్యాంకు | 1000 |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 500 |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 450 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 200 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 358 |
అర్హతలు :
IBPS PO/MT Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
IBPS PO/MT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IBPS PO/MT Recruitment 2025 పోస్టులకు ఆన్ లైన్ విధానంలో డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- UR / EWS / OBC : రూ.850/-
- SC / ST / PwD : రూ.175/-
ఎంపిక ప్రక్రియ:
IBPS PO/MT Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- ప్రిలిమినరీ ఎగ్జామ్
- మెయిన్స్ ఎగ్జామ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
IBPS PO/MT Recruitment 2025 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
IBPS PO/MT Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో ‘CRP PO / MT’ లింక్ పై క్లిక్ చేయాలి.
- కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేసన్ నంబర్ మరియు పాస్ వర్డ్ ద్వారా ప్రాథమిక వివరాలను నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 01 జూలై, 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 21 జూలై, 2025 |
ప్రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ తేదీ | ఆగస్టు, 2025 |
ప్రీ ఎగ్జామ్ తేదీ | ఆగస్టు, 2025 |
ప్రీ ఎగ్జామ్ ఫలితాలను అప్ లోడ్ చేసిన తేదీ | సెప్టెంబర్, 2025 |
మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన లోడ్ తేదీ | అక్టోబర్, 2025 |
మెయిన్స్ పరీక్ష తేదీ | అక్టోబర్, 2025 |
మెయిన్స్ పరీక్ష ఫలితాలు | నవంబర్, 2025 |
ఇంటర్వ్యూ తేదీ | డిసెంబర్ 2025 / జనవరి 2026 |
తాత్కాలిక కేటాయింపు తేదీ | జనవరి / ఫిబ్రవరి 2026 |
Notification | Click here |
Apply Online | Click here |