IB Security Assistant Notification 2025 Apply Online | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తులు ప్రారంభం

IB Security Assistant Recruitment 2025 హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) నుంచి మరో అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,987 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

IB Security Assistant Recruitment 2025 Overview:

  • నియామక సంస్థ : ఇంటెలిజెన్స్ బ్యూరో
  • పోస్టు పేరు : సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్
  • పోస్టుల సంఖ్య :  4,987
  • దరఖాస్తు ప్రక్రియ : 26 జూలై – 17 ఆగస్టు, 2025
  • అర్హతలు : 10వ తరగతి
  • జాబ్ లొకేషన్ : ఆల్ ఇండియా

పోస్టుల వివరాలు : 

ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.భారతదేశంలోని వివిధ సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)లలో మొత్తం 4,987 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఒక SIB కి దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రాంతంలోని స్థానిక భాష / మాండలికాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఉదాహరణకు – హైదరాబాద్ / విజయవాడ ప్రాంతాలలో దరఖాస్తు చేసుకుంటే తెలుగు భాష తప్పనిసరిగా రావాలి. లేదా ఇతర ప్రాంతాల్లో అప్లయ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రాంతం యొక్క భాష వచ్చి ఉండాలి. దీని కోసం  పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 4,987

SIBస్థానిక భాషఖాళీలు
హైదరాబాద్తెలుగు117
విజయవాడతెలుగు115
రాయ్ పూర్గోండి, హల్బీ, తెలుగు20
చెన్నైతమిళం285
బెంగళూరుకన్నడ, తుళు, బేరీ, కొంకణి, నవయతి2024

అర్హతలు : 

IB Security Assistant Recruitment 2025  సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • నివాస ధ్రువీకరణ పత్రం : అభ్యర్థులు అప్లయ్ చేసుకుంటున్న రాష్ట్రం యొక్క  నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి.  
  • స్థానిక భాష : దరఖాస్తు చేసుకుంటున్న సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కోసం స్థానిక భాష లేదా మాండలికాలలో ఏదైనా ఒక తప్పనిసరిగా వచ్చి ఉండాలి.  

వయస్సు :  

IB Security Assistant Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • 18 – 27 సంవత్సరాలు
  • SC /ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు

అప్లికేషన్ ఫీజు : 

IB Security Assistant Recruitment 2025 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా ఆఫ్ లైన్ ఎస్బీఐ చలాన్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి. 

కేటగిరీఫీజు
UR / EWS / OBC(పురుషులు)రూ.650/-
SC / ST / ExSm / Womenరూ.550/-

ఎంపిక ప్రక్రియ: 

IB Security Assistant Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • డిస్క్రిప్టివ్ పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

రాత పరీక్ష విధానం: 

  • రాత పరీక్ష100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఒక గంట సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ ఉంటుంది. 
  • అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు : జనరల్/EWS – 30, ఓబీసీ – 28, ఎస్సీ/ఎస్టీ-25 
టాపిక్ప్రశ్నలుమార్కులు
జనరల్ అవేర్నెస్2020
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2020
రీజనింగ్2020
జనరల్ ఇంగ్లీష్2020
జనరల్ స్టడీస్2020

డిస్క్రిప్టివ్ పరీక్ష విధానం : 

  • డిస్క్రిప్టివ్ పరీక్ష మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. ఒక గంట సమయం ఉంటుంది. 
  • స్థానిక భాష/మాండలికం నుంచి 500 పదాల భాగాన్ని ఇంగ్లీషులోకి మరియు ఇంగ్లీషు నుంచి ఇంగ్లీషులోకి అనువాదించాలి. 
  • అర్హత సాధించడానికి 50 మార్కులకు కనీసం 20 మార్కులు సాధించాలి. 

జీతం వివరాలు : 

IB Security Assistant Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-3 ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని అభ్యర్థులకు నెలకు రూ.38,000/- వరకు జీతం అందుతుంది. 

దరఖాస్తు విధానం : 

IB Security Assistant Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • IB Security Assistant Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.  
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 26 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఆగస్టు, 2025
NotificationClick here
Apply Online Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!