IB MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్

IB MTS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. జస్ట్ 10వ తరగతి పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఆకర్షణీయమైన జీతం వస్తుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు : 

హోమ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో. దేశీయ భద్రత, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఉగ్రవాదం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, విదేశీ ఏజెంట్‌ల నిగ్రహం వంటి అంశాలపై కీలక సమాచారం సేకరించడం IB ప్రధాన బాధ్యత. ఇలాంటి సంస్థ నుంచి ఉద్యోగ ప్రకటన వచ్చింది. 

  • పోస్టు పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) (జనరల్)
  • మొత్తం పోస్టుల సంఖ్య : 362

Also Read : Indian Army Sports Quota Recruitment 2025 | క్రీడాకారులకు ఆర్మీలో బంపర్ జాబ్స్

అర్హతలు: 

IB MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • అభ్యర్థులు అప్లయ్ చేసుకున్న రాష్ట్రం యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉండాలి. 

వయోపరిమితి : 

IB MTS Recruitment 2025 అభ్యర్థులకు 14 డిసెంబర్, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవతవ్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IB MTS Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • జనరల్ / EWS / OBC(పురుష అభ్యర్థులు) : రూ.650/-
  • ఎస్సీ / ఎస్టీ / మహిళలు : రూ.550/-

ఎంపిక ప్రక్రియ : 

IB MTS Recruitment 2025 ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ : ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఒక గంట వ్యవధి ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ గురించి పూర్తి నోటిఫికేషన్ లో చూడవచ్చు. 
  • డిస్క్రిప్టివ్ టెస్ట్ : ఈ పరీక్ష ఆఫ్ లైన్ లో ఉంటుంది. మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక గంట సమయం ఇస్తారు. ఈ పరీక్ష ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్స్ కవర్ చేస్తుంది. అభ్యర్థులు 50 మార్కులకు కనీసం 20 మార్కులు సాధించాలి. ఈ పరీక్ష అభ్యర్థుల ప్రాథమిక పట్టున తనిఖీ చేయడం మరియు ఇది కేవలం అర్హత మాత్రమే. 

Also Read : Bank of India SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

IB MTS Recruitment 2025  ఎంపికైన అభ్యర్థులకు  7వ సెంట్రల్ పే కమిషన్(CPC) పే మ్యాట్రిక్స్ లెవల్-1 ప్రకారం రూ.18,000 – రూ.56,900/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు రూ.30,000/- వరకు జీతం ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

IB MTS Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారికి వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 
  • ‘మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2025’ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 22 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 డిసెంబర్, 2025
NotificationClick here
Official WebsiteClick here

FAQs (4)

1. IB MTS Recruitment 2025 కోసం అవసరమైన అర్హత ఏమిటి?

IB MTS పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఇది మాధ్యమిక స్థాయి అభ్యర్థులకు గొప్ప అవకాశం.

2. IB MTS 2025 లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?

ఈ నియామక డ్రైవ్‌లో మొత్తం 362 MTS (G) పోస్టులు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా 37 SIB కార్యాలయాల్లో భర్తీ చేయబడతాయి.

3. IB MTS Salary ఎంత ఉంటుంది?

ఎంపికైన అభ్యర్థులకు లెవల్-1 పే స్కేల్ ₹18,000 – ₹56,900 ఇవ్వబడుతుంది. అదనంగా 20% ప్రత్యేక భద్రతా భత్యం కూడా లభిస్తుంది.

4. IB MTS 2025 దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ డిసెంబర్ 14, 2025. గడువు ముందే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.

Leave a Comment

Follow Google News
error: Content is protected !!