IB ACIO Tech Recruitment 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరో 258 బంపర్ జాబ్స్

IB ACIO Tech Recruitment 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 / టెక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 258 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  

ఖాళీల వివరాలు : 

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను టెక్నికల్ విభాగాలు మరియు వివిధ కేటగిరీల్లో విభజించారు. మొత్తం 258 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు స్ట్రీమ్ఖాళీలు
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ90
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్168
మొత్తం258

Also Read : AVNL Institute of Learning Recruitment 2025

అర్హతలు : 

IB ACIO Tech Recruitment 2025 అభ్యర్థులకు పోస్టు స్ట్రీమ్ ని బట్టి కింది అర్హతలు ఉండాలి. 

  • సంబంధిత విభాగాల్లో BE / B.Tech లేదా ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ లో MSc / MCA
  • అభ్యర్థులు 2023 / 2024 / 2025 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గేట్ లో అర్హత కటాఫ్ మార్కులు సాధించి ఉండాలి. 

వయోపరిమితి : 

IB ACIO Tech Recruitment 2025 అభ్యర్థులకు 16.11.2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.200/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : రూ.100/-
  • ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ : 

IB ACIO Tech Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : IRCTC Hospitality Monitor Recruitment 2025

జీతం వివరాలు : 

IB ACIO Tech Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IB ACIO Tech Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్స్  www.mha.gov.in  లేదా  www.ncs.gov.in లోకి వెళ్లాలి. 
  • ACIO-II/Tech నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 నవంబర్, 2025
NotificationClick here
Official WebsiteClick here

Also Read : AIIMS Mangalagiri Non-Faculty Recruitment 2025 | AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!