By Jahangir

Published On:

Follow Us
IAF Airmen Group Y Recruitment 2025

IAF Airmen Group Y Recruitment 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మెడికల్ అసిస్టెంట్ పోస్టులు

IAF Airmen Group Y Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎయిర్ మెన్ గ్రూప్ Y (నాన్ టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ (ఇన్ టేక్ 02/2026) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. భారతదేశపు పురుష అభ్యర్థులు మరియు గూర్ఖా (నేపాల్ కు చెందిన ) వారు ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 11వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

IAF Airmen Group Y Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ Y మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ లో ఎయిర్ మెన్ ఇన్ టేక్ 02/2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్య ప్రస్తావించబడలేదు. 

అర్హతలు : 

  • మెడికల్ అసిస్టెంట్ (10+2) అభ్యర్థులకు : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీషుతో 10+2 / ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులతో నాన్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 
  • మెడికల్ అసిస్టెంట్ (ఫార్మసీలో డిప్లొమా / బిఎస్సీ) అభ్యర్థులకు : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో ఇంటర్ + ఫార్మసీలో డిప్లొమా / బీఎస్సీ.

వయస్సు : 

IAF Airmen Group Y Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. 

BDL Trainee Engineer Recruitment 2025
BDL Trainee Engineer Recruitment 2025 | భారత్ డైనమిక్ లిమిటెడ్ లో 212 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
  • 10+2 అభ్యర్థులకు : 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • ఫార్మసీలో డిప్లొమా / బీఎస్సీ అభ్యర్థులకు : 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  

వైద్య మరియు శారీరక ప్రమాణాలు : 

  • ఎత్తు : 152.5 సెం.మీ
  • ఛాతీ : 77 సెం.మీ. శ్వాస తీసుకున్నప్పుడు 5 సెం.మీ. విస్తరణ
  • బరువు : ఎత్తు మరియు వయస్సుకు అనుగుణంగా ఉండాలి. 
  • కంటి చూపు : ప్రతి కంటిలో 6/36, ప్రతి కంటిలో 6/6 వరకు సరిచేయవచ్చు. 

అప్లికేషన్ ఫీజు  : 

IAF Airmen Group Y Recruitment 2025  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.550/- మరియు జీఎస్టీ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు  ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

IAF Airmen Group Y Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • ఆన్ లైన్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ 
  • అడాప్టిబిలిటి టెస్ట్ 1 & 2
  • వైద్య  పరీక్ష

జీతం వివరాలు : 

IAF Airmen Group Y Recruitment 2025  పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో రూ.14,600/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత నెలకు సుమారు రూ.26,900/- జీతం ఉంటుంది.

IB ACIO Recruitment 2025
IB ACIO Recruitment 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 పోస్టులకు నోటిఫికేషన్

దరఖాస్తు విధానం : 

IAF Airmen Group Y Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది. 
  • ‘Airmen Intake 02/2026’ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • మొబైల నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.  

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు  ప్రారంభ తేదీ : 11 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 జులై, 2025
  • ఆన్ లైన్ పరీక్ష తేదీ : 25 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!