IAF Agniveervayu Non Combatant Recruitment 2025 అగ్నిపథ్ స్కీమ్ ఇన్ టేక్ 01/2026 కింద ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా హాస్పిటాలిటీ మరియు హౌస్ కీపింగ్ విభాగాల్లో అగ్నివీర్ వాయు నాన్ – కంబాటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ లోపు ఆఫ్ లైన్ ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
IAF Agniveervayu Non Combatant Intake 01/2026 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ |
స్కీమ్ | అగ్నిపథ్ స్కీమ్ |
పోస్టు పేరు | అగ్నివీర్ వాయు నాన్ – కంబాటెంట్ |
స్ట్రీమ్స్ | హాస్పిటాలిటీ మరియు హౌస్ కీపింగ్ |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 01 సెప్టెంబర్, 2025 |
అర్హత | 10వ తరగతి |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన |
పోస్టుల వివరాలు :
అగ్నిపథ్ స్కీమ్ ఇన్ టేక్ 01/2026 కింద అగ్నివీర్ వాయు నాన్ – కంబాటెంట్ విభాగాల్లో హౌస్ కీపింగ్ మరియు హాస్పిటాలిటీ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మెస్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, కుక్, వాషర్ అప్, వాచ్్ మెన్, లాస్కార్, వార్డ్ అసిస్టెంట్ మరియు ఇతర నాన్ కంబాటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ఖాళీల వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొనబడలేదు.
అర్హతలు :
IAF Agniveervayu Non Combatant Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణత
- అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి :
IAF Agniveervayu Non Combatant Recruitment 2025 అభ్యర్థులు 01.01.2025 మరియు 01.07.2025 మధ్య (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థుల గరిష్ట వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
ఫిజికల్ మరియ మెడికల్ అర్హతలు :
- ఎత్తు : 152 సెం.మీ
- ఛాతీ : కనీసం 5 సెం.మీ విస్తరణ
- బరువు : ఎత్తు మరియు వయస్సుకు అనుగుణంగా
- విజన్ : ప్రతి కంటికి 6/36, 6/9కి సరిచేయవచ్చు. కలర్ విజన్ CP-III
- వినికిడి : సాధారణ వినికిడి
- దంతాలు : 14 డెంటల్ పాయింట్లు, ఆరోగ్యకరమైన చిగుళ్లు మరియు దంతాలు
- సాధారణ ఆరోగ్యం : ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా సేవ చేయడానికి శారీరకంగా మరియు మానసికంగా ధ్రుఢంగా ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
IAF Agniveervayu Non Combatant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానిక అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
IAF Agniveervayu Non Combatant Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
- స్ట్రీమ్ సూటిబిలిటీ టెస్ట్
- మెడికల్ టెస్ట్
జీతం :
IAF Agniveervayu Non Combatant Recruitment 2025 అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల కాలంలో అలవెన్సులతో పాటు ఫిక్స్డ్ నెల జీతం అందజేస్తారు.
- 1వ సంవత్సరం : రూ.30,000/-
- 2వ సంవత్సరం : రూ.33,000/-
- 3వ సంవత్సరం : రూ.36,500/-
- 4వ సంవత్సరం : రూ.40,000/-
దరఖాస్తు విధానం :
IAF Agniveervayu Non Combatant Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అవసరమైన వివరాలతో జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
- అవసరమైన పత్రాలను జత చేయాలి.
- సెప్టెంబర్ 1వ తేదీలోపు నిర్దేశించిన ప్రదేశాలలో పోస్ట్ / డ్రాప్ బాక్స్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ సమర్పించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 01 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Application Form | Click here |
Official Website | Click here |
Aeir port jobes
Location
Job