IAF Agniveer Vayu Intake 02/2026 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు కోసం పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూలై 11వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
IAF Agniveer Vayu Intake 02/2026 Overview :
నియామక సంస్థ | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ |
పోస్టు పేరు | అగ్నివీర్ వాయు |
పోస్టుల సంఖ్య | ప్రస్తావించబడలేదు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అప్లికేషన్ ఫీజు | రూ.550 + జీఎస్టీ |
జీతం | రూ.30,000 |
అర్హతలు :
IAF Agniveer Vayu Intake 02/2026 అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) మూడేళ్ల డిప్లొమా (లేదా) 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు
- సైన్స్ సబ్జెక్టులు కాకుండా : ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులతో పాటు ఇతర సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు
ఫిజికల్ క్వాలిఫికేషన్స్ :
పురుషులకు :
- ఎత్తు : 152.5 సెం.మీ
- బరువు : ఎత్తును బట్టి
- 10 పుష్ అప్స్ : ఒక నిమిషం
- 10 సిట్ అప్స్ : ఒక నిమిషం
- 20 స్క్వాట్స్ : ఒక నిమిషం
మహిళలకు :
- ఎత్తు : 152 సెం.మీ
- బరువు : ఎత్తును బట్టి
- 10 సిట్ అప్స్ : 01 నిమిషం 30 సెకన్లు
- 15 స్క్వాట్స్ : 01 నిమిషం
వయోపరిమితి :
IAF Agniveer Vayu Intake 02/2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 02.07.2005 కంటే ముందు మరియు 02.01.2009 తర్వాత జన్మించకూడదు.
అప్లికేషన్ ఫీజు :
IAF Agniveer Vayu Intake 02/2026 అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.550 మరియు జీఎస్టీ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఆన్ లైన విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
IAF Agniveer Vayu Intake 02/2026 పోస్టులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
జీతం వివరాలు :
IAF Agniveer Vayu Intake 02/2026 అగ్నివీర్ వాయు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం కింది విధంగా ఇవ్వడం జరుగుతుంది.
- 1వ సంవత్సరం : రూ.30,000/-
- 2వ సంవత్సరం : రూ.33,000/-
- 3వ సంవత్సరం : రూ.36,500/-
- 4వ సంవత్సరం : రూ.40,000/-
దరఖాస్తు విధానం :
IAF Agniveer Vayu Intake 02/2026 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- IAF Agniveer Vayu Intake 02/2026 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 31 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |