HPCL Junior Executive Jobs 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో 372 జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

HPCL Junior Executive Jobs 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు వివిధ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 372 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఫ్రెషర్స్ కి మరియు అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

HPCL Junior Executive Jobs 2025

పోస్టుల వివరాలు : 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫ్రెషర్స్ కి మరియు అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మొత్తం 372 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు : హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
  • పోస్టు పేరు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ జాబ్స్
  • పోస్టుల సంఖ్య : 372

ఫ్రెషర్స్ పోస్టులు : 300 ఖాళీలు

  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ : 10
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – సివిల్ : 50
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్- మెకానికల్ : 15
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – క్వాలిటీ కంట్రోల్ : 19
  • మెకానికల్ ఇంజనీర్ : 98
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్ : 35
  • సివిల్ ఇంజనీర్ : 16
  • కెమికల్ ఇంజనీర్ : 26
  • చార్టర్డ్ అకౌంటెంట్లు : 24
  • ఆఫీసర్ – హెచ్ఆర్ : 06
  • ఆఫీసర్ – ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ : 01

ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్స్ : 72 పోస్టులు

  • అసిస్టెంట్ ఆఫీసర్- అధికార భాష : 02
  • లా ఆఫీసర్ : 03
  • భద్రతా అధికారి : 05
  • సీనియర్ ఆఫీసర్ – సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ : 04
  • సీనియర్ ఆఫీసర్ – సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు : 06
  • సీనియర్ ఆఫీసర్ – సేల్స్(రిటైల్ / లూబ్స్ /డైరెక్ట్ సేల్ /ఎల్పీజీ) : 25
  • సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్ -ఇంధనేతర వ్యాపారం : 06
  • చీఫ్ మేనేజర్  / డిప్యూటీ జనరల్ మేనేజర్ – ఇంధనేతర వ్యాపారం : 02
  • మేనేజర్ – టెక్నికల్ :03
  • మేనేజర్ – సేల్స్ (R&D ప్రాడక్ట్స్ కమర్షలైజేషన్) : 01
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ – క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్) : 01
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ – టెక్నికల్ సర్వీస్ : 01
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ – పాలిమర్ ఎక్స్ పర్ట్ హెడ్ : 01
  • జనరల్ మేనేజర్ – బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ : 01
  • IS ఆఫీసర్ : 10
  • IS సెక్యూరిటీ ఆఫీసర్- సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ : 01

అర్హతలు మరియు వయోపరిమితి వివరాలు : 

HPCL Junior Executive Jobs 2025 పోస్టులకు విద్యార్హతలు మరియు వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరుఅర్హతలుగరిష్ట వయోపరిమితి
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ఏదైనా డిగ్రీ25 సంవత్సరాలు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ -సివిల్సివిల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా25 సంవత్సరాలు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ -మెకానికల్మెకానికల్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా25 సంవత్సరాలు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – క్వాలిటీ కంట్రోల్BSc(Chemistry)25 సంవత్సరాలు
మెకానికల్ ఇంజనీర్మెకానికల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech25 సంవత్సరాలు
ఎలక్ట్రికల్ ఇంజనీర్ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్25 సంవత్సరాలు
సివిల్ ఇంజనీర్సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్25 సంవత్సరాలు
కెమికల్ ఇంజనీరింగ్కెమికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్25 సంవత్సరాలు
చార్టర్డ్ అకౌంటెంట్లుCA With Article-ship and Membership of ICAI 25 సంవత్సరాలు
ఆఫీసర్ – హెచ్ఆర్హెచ్ఆర్ /పర్సనల్ మేనేజ్మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా హెచ్ఆర్ స్పెషలైజేషన్ తో ఎంబీఏ25 సంవత్సరాలు
ఆఫీసర్ – ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో 2 సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్/ కెమికల్ / సివిల్ లో 4 సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్25 సంవత్సరాలు
  • ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్ల విద్యార్హతలు మరియు వయోపరిమితి కోసం అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూడగలరు. 

దరఖాస్తు ఫీజు : 

HPCL Junior Executive Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • UR / OBC / EWS : ₹1,180/-
  • SC / ST / PwBD : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

HPCL Junior Executive Jobs 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

  • అప్లికేషన్ షార్ట్ లిస్ట్
  • కంప్యూటర్ బేస్ట్ టెస్ట్  / రాత పరీక్ష/ నెట్ స్కోర్ / టైపింగ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • గ్రూప్ డిస్కషన్
  • వ్యక్తిగల ఇంటర్వ్యూ
  • మూట్ కోర్ట్ ( లా ఆఫీసర్ పోస్టులకు మాత్రమే)
  • సైకోమెట్రిక్ అసెస్మెంట్
  • స్కిల్ టెస్ట్
  • ఫిజికల్ ఫిట్ నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ (కొన్ని పోస్టులకు)
  • వైద్య పరీక్ష

పే స్కేల్ వివరాలు : 

HPCL Junior Executive Jobs 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతాలు చెల్లిస్తారు. 

  • ఫ్రెషర్స్ ఉద్యోగాలకు పోస్టును బట్టి రూ.30,000 నుంచి రూ.1,60,000/- వరకు జీతం ఉంటుంది.
  • ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు పోస్టును బట్టి రూ.40,000 నుంచి రూ.2,80,000/- వరకు జీతాలు ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

HPCL Junior Executive Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. 
  • ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • అన్ని వివరాలు ధ్రువీకరించిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ(ఫ్రెషర్స్) : 30 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ (ఎక్స్ పీరియన్స్) : 15 – 07 – 2025
NotificationClick here
Apply OnlineClick here

1 thought on “HPCL Junior Executive Jobs 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో 372 జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!