HPCL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
HPCL Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు :
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్య పేర్కొనలేదు.
అప్రెంటిస్ విభాగాలు :
- సివిల్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)
అర్హతలు :
HPCL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన ఉండాలి.
- అభ్యర్థులకు అన్ని సెమిస్టర్లు / సంవత్సరాల్లో కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి.
- SC / ST / PwBD అభ్యర్థులకు అన్ని సెమిస్టర్లు / సంవత్సరాల్లో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి.
- అభ్యర్థులు ఏప్రిల్ 1, 2022 లేదా ఆ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏప్రిల్ 1 2022 కి ముందు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కారు.
వయస్సు:
HPCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
HPCL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్నికేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
HPCL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ముందుగా అప్లయ్ చేసుకున్న అభ్యర్థులను HPCL నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా విభాగాల వారీగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యుకు పిలుస్తారు.
- షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు.
- ఇంజనీరింగ్ డిగ్రీలో విద్యార్హతల్లో మార్కులు మరియు ఇంటర్వ్యూలో పొందిన స్కోర్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
జీతం వివరాలు :
HPCL Apprentice Recruitment 2025 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజనీరింగ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.25,000/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
HPCL Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. దరఖాస్తు చేసే ముందు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ పోర్టల్ ని సందర్శించాలి.
- కొత్త రిజిస్ట్రేషన్ కోసం సైన్ అప్ చేసుకోవాలి.
- తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అభ్యర్థులకు ఒక అప్లికేషన్ మాత్రమే అనుమతించబడుతుంది.
- అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 16 – 05 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 30 – 05 – 2025 |
ఇంటర్వ్యూ తేదీ (తాత్కాలికం) | జూన్ 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |