HAL Apprentice Recruitment 2025 | HALలో 588 అప్రెంటిస్ పోస్టులు భర్తీ

HAL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 588 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ / డిప్లొమా అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ వరకు మరియు ఐటీఐ అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

HAL Apprentice Recruitment 2025 Overview:

నియామక సంస్థహిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 
పోస్టు పేరుగ్రాడ్యుయేట్ అప్రెంటిస్,  డిప్లొమా అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య588
శిక్షణ కాలం1 సంవత్సరం
లొకేషన్నాసిక్, మహారాష్ట్ర

ఖాళీల వివరాలు : 

వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

పోస్టు పేరుఖాళీలు
గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్278
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్310
మొత్తం588

అర్హతలు : 

HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్సంబంధిత విభాగాల్లో BE / B.Tech
డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్సంబంధిత విభాగాలలో 3 సంవత్సరాల డిప్లొమా
నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్BA / B.Com / BSc / BBA 
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్NCVT / SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ ట్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఏ సంవత్సరాల్లో పాసై ఉండాలి?

గ్రాడ్యుయేట్ / డిప్లొమా / నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు 2021, 2022, 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో డిగ్రీ / డిప్లొమా పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ: 

HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • మెరిట్ ఆధారిత షార్ట్ లిస్టింగ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

  • ఇంజనీరింగ్ & నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.9,000/-
  • డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ : రూ.8,000/-
  • ఐటీఐ అప్రెంటిస్ (2 సంవతత్సరాల ట్రేడ్) : రూ.8,050/-
  • ఐటీఐ అప్రెంటిస్ (1 సంవత్సరం ట్రేడ్) : రూ.7,750/-

దరఖాస్తు విధానం : 

HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • స్టేజ్-1 పోర్టల్ రిజిస్ట్రేషన్ : గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ అభ్యర్థులు NATS పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. ఐటీఐ అప్రెంటిస్ అభ్యర్థులు NAPS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లింక్స్ కింద ఇవ్వబడ్డాయి. 
  • స్టేజ్-2 గూగుల్ అప్లికేషన్ ఫారమ్: NATS / NAPS రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత HAL అందించిన అధికారిక గూగుల్ ఫారమ్ ని నింపాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 జూలై, 2025
  • గ్రాడ్యుయేట్ / డిప్లొమా దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఆగస్టు, 2025
  • ఐటీఐ దరఖాస్తులకు చివరి తేదీ : 02 సెప్టెంబర్, 2025
Graduate / Diploma NotificationClick here
ITI NotificationClick here
NATS Portal RegistrationClick here
NAPS Portal RegistrationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!