HAL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 322 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిలో ఐటీఐ అప్రెంటిస్ మరియు డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
HAL Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు :
దేశంలో ప్రముఖ ఏరోస్పేస్ మరియు రక్షణ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల నియామకాలను హైదరాబాద్ లోని HAL ఏవియానిక్స్ విభాగం చేపడుతోంది. మొత్తం అప్రెంటిస్ పోస్టులు 322 ఉన్నాయి. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ శిక్షణ ఉంటుంది. ఈ ట్రైనింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి మరియు కెరీర్ అవకాశాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
పోస్టులు | ఖాళీల సంఖ్య |
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ | 195 |
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ | 34 |
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 32 |
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 61 |
మొత్తం పోస్టుల సంఖ్య | 322 |
HAL ITI Apprentice Vacancy :
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 55
- ఫిట్టర్ – 45
- కోపా – 50
- ఎలక్ట్రీషియన్ – 10
- మెషినిస్ట్ – 10
- టర్నర్ – 06
- వెల్డర్ – 03
- రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ – 02
- ప్లంబర్ – 02
- పెయింటర్ – 06
- డీజిల్ మెకానిక్ – 01
- మోటార్ వెహికిల్ మెకానిక్ – 01
- డ్రాఫ్ట్ మెన్ సివిల్ – 02
- డ్రాఫ్ట్ మెన్ మెకానికల్ – 02
HAL Technician(Diploma) Apprentice Vacancy :
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 20
- మెకానికల్ ఇంజనీరింగ్ – 05
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ – 04
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 04
- సివిల్ ఇంజనీరింగ్ – 01
HAL General Stream Graduate Apprentice Vacancy :
- B.Com – 15
- BSc(Electronics) – 10
- BSc (Chemistry) – 02
- BSc (Computers) – 05
HAL Engineering Graduate Apprentice Vacancy :
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 30
- మెకానికల్ ఇంజనీరింగ్ – 13
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 10
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ – 04
- సివిల్ ఇంజనీరింగ్ – 02
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 02
HAL Apprentice Education Qualifications :
HAL Apprentice Recruitment 2025 పోస్టులకు అప్రెంటిస్ షిప్ ని బట్టి విద్యార్హతలు ఉంటాయి. డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు జాయిన్ అయ్యే తేదీ మరియు విద్యార్హతల్లో ఉత్తీర్ణులైన తేదీ మధ్య అంతరం 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
పోస్టు పేరు | విద్యార్హతలు |
ఐటీఐ అప్రెంటిస్ | సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత |
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ | సంబంధిత ఇంజనీరింగ్ / టెక్నాలజీ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. |
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | బీకామ్ / బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్) / బీఎస్సీ(కెమిస్ట్రీ) / బీఎస్సీ(కంప్యూటర్స్) |
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత |
వయస్సు:
HAL Apprentice Recruitment 2025 పోస్టులకు 18 ఏళ్లు పైబడిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు జాయిన్ అయ్యే తేదీ మరియు విద్యార్హతల్లో ఉత్తీర్ణులైన తేదీ మధ్య అంతరం 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
అప్లికేషన్ ఫీజు:
HAL Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
HAL Apprentice Recruitment 2025 పోస్టులకు అభ్యర్థల ఎంపిక పూర్తిగా అర్హత పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. వాక్ ఇన్ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి.
జీతం వివరాలు :
HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో అప్రెంటిస్ చట్టం 1961 నియమాల ప్రకారం స్టయిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
HAL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులకు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో వాక్ ఇన్ ఎంపిక ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే వాక్ ఇన్ కి హాజయర్యే ముందు అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ కోసం అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.
- డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.
వాక్ ఇన్ తేదీలు:
ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ వాక్ ఇన్ తేదీలు:
ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్ | మే 26, 2025 |
కోపా, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్ మెన్ మెకానికల్ | మే 27, 2025 |
మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, టర్నర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, వెల్డర్ | మే 28, 2025 |
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – మే 29, 2025
- డిప్లొమా అప్రెంటిస్ – మే 30, 2025
- జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ – మే 31, 2025
వాక్ ఇన్ అడ్రస్ :
ఉత్సవ్ సదన్ ఆడిటోరియమ్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వెనుక, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ – 500042
ITI Apprentice Notification | CLICK HERE |
Diploma / Graduate Notification | CLICK HERE |
ITI Registration Link | CLICK HERE |
Diploma / Graduate Registration Link | CLICK HERE |