Goa Shipyard MT Jobs 2025 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన Goa Shipyard Limited (GSL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం Goa Shipyard Jobs 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్, ఫైనాన్స్, రోబోటిక్స్ విభాగాలలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Goa Shipyard Jobs 2025 Overview
విభాగం | వివరాలు |
భర్తీ సంస్థ | Goa Shipyard Limited (GSL) |
పోస్టులు | మేనేజ్మెంట్ ట్రైనీ (Mechanical, Electrical, Electronics, Naval Architecture, Finance, Robotics) |
మొత్తం ఖాళీలు | 32 |
జీతం | ₹40,000 – ₹1,40,000 (CTC ₹11.65 లక్షల నుండి ₹15.40 లక్షల వరకు) |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 25-08-2025 |
చివరి తేదీ | 24-09-2025 |
అధికారిక వెబ్‌సైట్ | www.goashipyard.in |
ఖాళీల వివరాలు (Vacancy Details)
విభాగం | పోస్టులు | ఖాళీలు |
Mechanical | మేనేజ్మెంట్ ట్రైనీ | 12 |
Electrical | మేనేజ్‌మెంట్ ట్రైనీ | 06 |
Electronics | మేనేజ్‌మెంట్ ట్రైనీ | 04 |
Naval Architecture | మేనేజ్‌మెంట్ ట్రైనీ | 05 |
Finance | మేనేజ్‌మెంట్ ట్రైనీ | 03 |
Robotics | మేనేజ్‌మెంట్ ట్రైనీ | 02 |
మొత్తం | 32 |
అర్హతలు (Eligibility)
Goa Shipyard MT Jobs 2025 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- Mechanical / Electrical / Electronics / Naval Architecture / Robotics విభగాల్లో కనీసం 60% మార్కులతో B.E / B.Tech.
- Finance విభాగంలో CA / ICMA పూర్తి చేసిన అభ్యర్థులు.
- చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు (కనీసం 60% ఉండాలి).
వయోపరిమితి (Age Limit) (31-07-2025 నాటికి)
Goa Shipyard MT Jobs 2025 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- UR: 28 సంవత్సరాలు
- OBC: 31 సంవత్సరాలు
- SC/ST: 33 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు (Application Fee)
Goa Shipyard MT Jobs 2025 అభ్యర్థులు SBI e-pay ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- Gen / OBC / EWS: ₹500
- SC/ST/PwBD/Ex-Servicemen: ఫీజు లేదు
ఎంపిక విధానం (Selection Process)
Goa Shipyard MT Jobs 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- Part 1: టెక్నికల్ సబ్జెక్ట్ ప్రశ్నలు – 60 మార్కులు
- Part 2: జనరల్ ఆప్టిట్యూడ్ – 25 మార్కులు
- మొత్తం – 85 మార్కులు
- Part 1: టెక్నికల్ సబ్జెక్ట్ ప్రశ్నలు – 60 మార్కులు
- ఇంటర్వ్యూ – 15 మార్కులు
- ఫైనల్ సెలక్షన్ – రాత పరీక్ష + ఇంటర్వ్యూ ఆధారంగా
జీతం (Salary & Benefits)
- ట్రైనింగ్ పీరియడ్: ₹40,000 + అలవెన్సులు
- అసిస్టెంట్ మేనేజర్‌గా కన్ఫర్మ్ అయిన తర్వాత: ₹40,000 – ₹1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- మెడికల్, ఇన్సూరెన్స్, ఇతర భత్యాలు అందిస్తారు.
దరఖాస్తు విధానం (How to Apply)
Goa Shipyard MT Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో Advt.No. 06/2025 గమనించి దరఖాస్తు చసుకోగలరు
- అధికారిక వెబ్‌సైట్ www.goashipyard.in కు వెళ్లాలి.
- “Careers” → Apply Now క్లిక్ పై చేయాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- దరఖాస్తులు ప్రారంభం: 25 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 24 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |