Exim Bank MT Recruitment 2026 : భారత ప్రభుత్వానికి చెందిన Export-Import Bank of India (Exim Bank) 2025-26 సంవత్సరానికి గాను Management Trainee (Banking Operations) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక బ్యాంకింగ్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. గ్రాడ్యుయేషన్ + పీజీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి కెరీర్ ఛాన్స్. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ చేయవచ్చు. కాబట్టి All-India సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నవారే అప్లై చేయాలి.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 Management Trainee (MT – Banking Operations) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో UR, SC, ST, OBC (NCL), EWS కేటగిరీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. PwBD అభ్యర్థులకు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ వర్తిస్తుంది.
Also Read : NABARD Recruitment 2026 : డిగ్రీ అర్హతతో 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
అర్హతలు (Educational Qualifications)
Exim Bank MT Recruitment 2026 అభ్యర్థులు కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదనంగా MBA / PGDBA / PGDBM / MMS (Finance / International Business / Foreign Trade) లేదా Chartered Accountant (CA) అర్హత తప్పనిసరి. రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్సులు చేసినవారికే అర్హత ఉంటుంది. Distance / Open University అభ్యర్థులు అర్హులు కారు.
వయోపరిమితి (Age Limit)
Exim Bank MT Recruitment 2026 31 డిసెంబర్ 2025 నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC (NCL) వారికి 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- General & OBC : ₹600/-
- SC / ST / PwBD / EWS / మహిళలు : ₹100/-
ఎంపిక ప్రక్రియ (Selection Process)
Exim Bank MT Recruitment 2026 ఎంపిక ప్రక్రియలో ముందుగా Written Test నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని Personal Interviewకి పిలుస్తారు.Written Test మార్కులకు 70% వెయిటేజ్, Interviewకు 30% వెయిటేజ్ ఉంటుంది. రెండు దశల్లో మెరిట్ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.
పరీక్ష విధానం (Exam Pattern)
Written Exam పూర్తిగా Subjective (Descriptive) విధానంలో ఉంటుంది.
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో Financial Statements మరియు Professional Knowledge పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు.
జీతం వివరాలు (Salary Details)
Exim Bank MT Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు ₹65,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక Deputy Manager (JM-I)గా నియమిస్తారు. అప్పుడు జీతం సుమారు ₹48,480 – ₹85,920 స్కేల్‌లో ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
Exim Bank MT Recruitment 2026 అభ్యర్థులు Exim Bank అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఫోటో, సంతకం, thumb impression, డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 17 జనవరి 2026
- చివరి తేదీ: 01 ఫిబ్రవరి 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RBI Office Attendant Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో RBIలో 572 ఉద్యోగాలు