Engine Factory Avadi Apprentice Recruitment 2025 తమిళనాడులోని అవడిలో ఉన్న ఇంజిన్ ఫ్యాక్టరీ అవడి నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, డిప్లొమా టెక్నీషియన్ మరియు ట్రేడ్ (ఎక్స్-ఐటీఐ) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 81 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 15వ తేదీన డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
ఖాళీల వివరాలు :
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంజిన్ ఫ్యాక్టరీ అవడి నుంచి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 81 ఖాళీలు ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ | 16 |
డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ | 05 |
ట్రేడ్(ఎక్స్-ఐటీఐ) అప్రెంటిస్్ | 60 |
మొత్తం | 81 |
అర్హతలు :
Engine Factory Avadi Apprentice Recruitment 2025 గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అభ్యర్థులు 2021 / 2022 / 2023 / 2024 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
- గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ : మెకానికల్/ ఈఈఈ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ : మెకానికల్/ సీఎస్ఈ/ ఈఈఈ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- ట్రేడ్ (ఎక్స్-ఐటీఐ) అప్రెంటిస్ : ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎంఎంవి వంటి ట్రేడ్లలో కనీసం 50 శాతం మార్కులతో NCVT సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు :
Engine Factory Avadi Apprentice Recruitment 2025 అప్రెంటిస్ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది. అభ్యర్థులు 2021 / 2022 / 2023 / 2024 సంవత్సరాల్లో విద్యార్హతల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
Engine Factory Avadi Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించబడదు. అర్హతలు మరియు ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
Engine Factory Avadi Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | స్టైఫండ్ |
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ | రూ.18,000/- |
డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ | రూ.16,200/- |
ట్రేడ్(ఎక్స్-ఐటీఐ) అప్రెంటిస్ | రూ.16,200/- |
దరఖాస్తు విధానం:
Engine Factory Avadi Apprentice Recruitment 2025 వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హజరయ్యే అభ్యర్థులు ముందుగా సంబంధిత అప్రెంటిస్ పోర్టల్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోర్టల్ లింక్ కింద ఇవ్వబడ్డాయి.
అవసరమైన పత్రాలు :
వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట కింద ఇచ్చిన పత్రాల ఒరిజనల్ మరియు ఫొటో కాపీలను తీసుకెళ్లాలి.
- ఇటీవల పాస్ సైజ్ ఫొటో
- విద్యార్హత సర్టిఫికెట్లు
- అన్ని సెమిస్టర్లు / సంవత్సరాల మార్క్ షీట్లు
- NCVT సర్టిఫికెట్(ఐటీఐ అభ్యర్థులకు)
- కుల / వర్గ ధ్రువీకరణ సర్టిఫికెట్(వర్తిస్తే)
- ఆధార్ కార్డు లేదా చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడెంటిటీ కార్డు
- NATS / NAPS పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ రుజువు
వాక్ ఇన్ తేదీలు :
- 15 సెప్టెంబర్, 2025 ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
- వేదిక : ట్రైనింగ్ స్కూల్, ఇంజిన్ ఫ్యాక్టరీ అవడి, చెన్నై
(Graduate & Diploma) registration | Click here |
ITI Registration | Click here |
Notification | Click here |