EMRS Teaching & Non Teaching Recruitment 2025: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టులకు డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ డీఎస్సీలో చాలా మంది బాగా ప్రిపేర్ అయిన వారికి కూడా జాబ్స్ రాలేదు. అలాంటి వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకలవ్య స్కూల్స్ లో ఖాళీలను భర్తీ చేస్తోంది. తాజాగా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) కింద ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7267 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

EMRS Teaching & Non Teaching Recruitment 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ |
పోస్టు పేరు | టీచింగ్ మరయు నాన్ టీచింగ్ |
పోస్టుల సంఖ్య | 7,267 |
పరీక్ష పేరు | EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్(ESSE) 2025 |
దరఖాస్తు ప్రక్రియ | 19 సెప్టెంబర్ – 23 అక్టోబర్, 2025 |
దరఖస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | భారతదేశం అంతటా |
Also Read : NIOS Recruitment 2025 | రూ.50 వేల జీతంతో ఓపెన్ స్కూల్ లో ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
సెంట్రల్ గవర్నెమంట్ లో టీచర్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న అభ్యర్థుల కోసం ఓ భారీ నోటిఫికేషన్ అయితేే రిలీజ్ అయ్యింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 7,267 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
TGT (Main Subjects) | 3311 |
TGT(Third Language) | 652 |
TGT(ఇతరాలు) | 1697 |
హాస్టల్ వార్డెన్ (పురుషుడు) | 335 |
హాస్టల్ వార్డెన్ (మహిళ) | 334 |
మొత్తం | 7267 |
అర్హతలు :
EMRS Teaching & Non Teaching Recruitment 2025 టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ మరియు BEd ఉత్తీర్ణత సాధించిలి. మరియు CTET అర్హత తప్పనిసరిగా ఉండాలి. హాస్టల్ వార్డెన్ కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
TGT(ఇంగ్లీష్ / హిందీ / మ్యాథ్స్ / సైన్స్ / సోషల్ స్టడీస్) | సంబంధత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ + BEd + CTET లేదా సంబంధిత సబ్జెక్టులో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ |
TGT(Third Language ) | సంబంధిత లాంగ్వేజ్ ను మెయిన్ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ + B.Ed + CTET |
TGT (Music) | గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ |
TGT(Atrs) | ఫైన్ ఆర్ట్స్ / క్రాఫ్ట్స్ లో డిగ్రీ లేదా ఫైన్ ఆర్ట్స్ లో B.Ed |
TGT(PET) | ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ |
TGT (లైబ్రేరియన్) | లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ లేదా లైబ్రరీ సైన్స్ లో 1 సంవత్సరం డిప్లొమాతో గ్రాడ్యుయేషన్ |
హాస్టల్ వార్డెన్(పురుషుడు మరియు మహిళలు) | ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ |
వయోపరిమితి :
EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల మద్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | TGT ఫీజు | హాస్టల్ వార్డెన్ ఫీజు |
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ | రూ.1,500/- | రూ.1,000/- |
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ | ఫీజు లేదు | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్(ESSE) 2025 ఆధారంగా జరుగుతుంది. ఎగ్జామ్ OMR ఆధారిత ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
రాత పరీక్ష విధానం :
TGT పోస్టులకు : 150 మార్కులకు
- ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ : 120 మార్కులు
- భాష సామర్థ్య పరీక్ష : 30 మార్కులు
- జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ICT నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూట్, డొమైన్ నాలెడ్జ్, భాష సామర్థ్య పరీక్షపై ప్రశ్నలు ఉంటాయి.
- 180 నిమిషాల సమయం ఇస్తారు.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
హాస్టల్ వార్డెన్ పోస్టులకు : 120 మార్కులకు
- ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ : 120 మార్కులు
- జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ICT నాలెడ్జ్,Knowledge of POCSO and other children safety related Acts of Govt of India, భాష సామర్థ్య పరీక్ష
- 150 నిమిషాల సమయం ఇస్తారు.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
Also Read : Bank of Baroda Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్ – జీతం రూ.1.2 లక్షల వరకు!
జీతం వివరాలు :
EMRS Teaching & Non Teaching Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం మ్యాట్రిక్స్ ప్రకారం ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | జీతం |
TGT(మెయిన్ సబ్జెక్ట్) | రూ.44,900 – రూ.1,42,400/- |
TGT(ఇతరాలు) | రూ.35,400 – రూ.1,12,400/- |
హాస్టల్ వార్డెన్ | రూ.29,200 – రూ.92,300/- |
దరఖాస్తు విధానం :
EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ESSE 2025 Online Application పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- స్కాన్ చేసిన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు ::
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 23 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APPSC Hostel Welfare Officer Recruitment 2025 | ఏపీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్