ECL Apprentice recruitment 2025 ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ECL) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా PGPT & PDPT అప్రెంటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టైఫండ్ తో ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లోమా పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీలోపు NATS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ECL Apprentice recruitment 2025 Overview
అంశం | వివరాలు |
నియామక సంస్థ | ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL) |
పోస్టులు | PGPT & PDPT అప్రెంటీస్ |
ఖాళీలు | 1,123 |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ (NATS పోర్టల్) |
దరఖాస్తులకు చివరి తేదీ | 11 సెప్టెంబర్ 2025 |
అర్హత | సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా + NATS రిజిస్ట్రేషన్ |
శిక్షణ వ్యవధి | 1 సంవత్సరం |
స్టైపెండ్ | PGPT: ₹9000/-, PDPT: ₹8000/- |
అధికారిక వెబ్‌సైట్ | www.easterncoal.nic.in |
విభాగాల వారీగా ఖాళీలు
అప్రెంటీస్ రకం | విభాగం | ఖాళీలు |
PGPT | మైనింగ్ ఇంజినీరింగ్ | 180 |
సివిల్ ఇంజినీరింగ్ | 25 | |
మెకానికల్ ఇంజినీరింగ్ | 25 | |
కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ | 25 | |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | 25 | |
మొత్తం (PGPT) | — | 280 |
PDPT | మైనింగ్ ఇంజినీరింగ్ | 643 |
సివిల్ ఇంజినీరింగ్ | 50 | |
మెకానికల్ ఇంజినీరింగ్ | 50 | |
కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ | 50 | |
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ | 50 | |
మొత్తం (PDPT) | — | 843 |
మొత్తం ఖాళీలు | — | 1123 |
అర్హతలు
ECL Apprentice recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో డిగ్రీ లేదా డిప్లోమా ఉత్తీర్ణులై ఉండాలి. NATS పోర్టల్‌లో రిజిస్టరై ఉండాలి. BOPT నుండి కాల్ లెటర్ పొందాలి.
ఎంపిక ప్రక్రియ మరియు శిక్షణ
ECL Apprentice recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులు BOPT కాల్ లెటర్‌లో పేర్కొన్న తేదీకి పశ్చిమ బర్దమాన్‌లోని డిషెర్గఘ్, HRD కార్యాలయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో హాజరుకావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, ఎంపికైన వారికి శిక్షణ ఎంగేజ్‌మెంట్ లెటర్ ఇస్తారు.
స్టైపెండ్ వివరాలు
ECL Apprentice recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
అప్రెంటీస్ టైప్ | స్టైఫండ్ |
PGPT | రూ.9000/- |
PDPT | రూ.8000/- |
అవసరమైన పత్రాలు
- మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్
- డిగ్రీ/డిప్లోమా ఫైనల్ మార్క్‌షీట్స్
- ఆధార్ లింక్‌డ్ బ్యాంక్ వివరాలు
- కుల ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ ఫోటో
- ECL వెబ్‌సైట్‌లోని అండర్‌టేకింగ్ అఫిడవిట్ ఫార్మాట్
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ తేదీ : 08 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11 సెప్టెంబర్, 2025
Notification | Click here |
NATS Portal | Click here |
Official Website | Click here |