By Jahangir

Published On:

Follow Us
ECIL GET Recruitment 2025

ECIL GET Recruitment 2025 | ECIL లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు

ECIL GET Recruitment 2025 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ECIL GET Recruitment 2025

పోస్టుల వివరాలు: 

భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 

  • గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ : 80 పోస్టులు

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల ఖాళీలు

పోస్టు విభాాగాలుఖాళీల సంఖ్య
ECE / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్34
E&I / ఇన్ స్ట్రుమెంటేషన్02
CSE / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ18
మెకానికల్16
EEE / ఎలక్ట్రికల్05
సివిల్03
కెమికల్02
మొత్తం పోస్టుల సంఖ్య80

అర్హతలు : 

ECIL GET Recruitment 2025 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

వయోపరిమితి: 

ECIL GET Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరి అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు: 

ECIL GET Recruitment 2025 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • UR / EWS / OBC : రూ.1,000/-
  • SC / ST / PwBD / డిఫెన్స్ అధికారులు  / ECIL ఉద్యోగులు : అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

ECIL GET Recruitment 2025 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విధానం

కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఒక ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షలో ముఖ్యంగా కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల నంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. 

ఎగ్జామ్ సెంటర్స్

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు
  • బెంగళూరు
  • చెన్నై
  • హైదరాబాద్
  • ముంబై
  • న్యూఢిల్లీ
  • కోల్ కతా

 పే స్కేల్ వివరాలు : 

ECIL GET Recruitment 2025 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి ప్యాకేజీతో జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలోనే నెలకు రూ.40,000 – రూ.1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకు సుమారు రూ.75,000/- వరకు జీతం వస్తుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఇదే పే స్కేల్ కి 3 శాతం ఇంక్రిమెంట్ ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

ECIL GET Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అక్కడ కెరీర్ విభాగంలో ‘కరెంట్ జాబ్ ఓపెనింగ్స్’లో ‘గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ’ రిక్రూట్మెంట్ పై క్లిక్ చేయాలి. 
  • ఆన్  లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా పూర్తి చేయాలి. 
  • ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 16 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 05 – 06 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!