DSSSB TGT Teacher Recruitment 2025: టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(DSSSB) నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,346 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుచి నవంబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు CTET క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.

DSSSB TGT Teacher Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(DSSSB) |
పోస్టు పేరు | TGT(వివిధ సబ్జెక్టులు), డ్రాయింగ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్. |
పోస్టుల సంఖ్య | 5,346 |
దరఖాస్తు ప్రక్రియ | 9 అక్టోబర్ – 7 నవంబర్, 2025 |
దరఖస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : Central University of Karnataka Recruitment 2025 | CUKలో నాన్ టీచింగ్ జాబ్స్
ఖాళీల వివరాలు (DSSSB TGT Teacher Vacancies) :
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి టీజీటీ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,346 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- TGT Mathematics (గణితం)
- Male: 744 పోస్టులు
- Female: 376 పోస్టులు
- TGT English (ఇంగ్లీష్)
- Male: 869 పోస్టులు
- Female: 104 పోస్టులు
- TGT Social Science (సామాజిక శాస్త్రం)
- Male: 310 పోస్టులు
- Female: 92 పోస్టులు
- TGT Natural Science (సైన్స్)
- Male: 630 పోస్టులు
- Female: 502 పోస్టులు
- TGT Hindi
- Male: 420 పోస్టులు
- Female: 136 పోస్టులు
- TGT Sanskrit
- Male: 342 పోస్టులు
- Female: 416 పోస్టులు
- TGT Urdu
- Male: 45 పోస్టులు
- Female: 116 పోస్టులు
- TGT Punjabi
- Male: 67 పోస్టులు
- Female: 160 పోస్టులు
- Drawing Teacher – 15 పోస్టులు
- Special Education Teacher (NDMC) – 2 పోస్టులు
మొత్తం పోస్టులు: 5346
అర్హతలు(Eligibility):
DSSSB TGT Teacher Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ (Graduation) ఉండాలి.
- B.Ed. లేదా సమానమైన టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
- కొంతమంది పోస్టులకు CTET సర్టిఫికేట్ తప్పనిసరి.
- డ్రాయింగ్ టీచర్‌కు ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ/డిప్లొమా అవసరం.
- స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు Special Educationలో B.Ed. / Diploma ఉండాలి.
వయోపరిమితి(Age Limit):
DSSSB TGT Teacher Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fees):
DSSSB TGT Teacher Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- General & OBC అభ్యర్థులు : రూ.100/-
- SC/ST/వికలాంగులు/మహిళలు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection process):
DSSSB TGT Teacher Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష (Computer Based Test) ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షను DSSSB One Tier Examination అని పిలుస్తుంది.
పరీక్ష విధానం :
- పరీక్ష రకం: ఆన్‌లైన్ CBT (Multiple Choice Questions – MCQs)
- పరీక్ష వ్యవధి: 2 గంటలు (120 నిమిషాలు)
- మొత్తం ప్రశ్నలు: 200
- మొత్తం మార్కులు: 200 (ప్రతి ప్రశ్నకు 1 మార్కు)
- నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
ప్రశ్నాపత్రం విభజన:
Section – A (General Part – 100 Marks)
- General Awareness (సాధారణ అవగాహన) – 20 ప్రశ్నలు (20 మార్కులు)
- General Intelligence & Reasoning (తార్కిక శక్తి) – 20 ప్రశ్నలు (20 మార్కులు)
- Arithmetical & Numerical Ability (గణిత నైపుణ్యం) – 20 ప్రశ్నలు (20 మార్కులు)
- Hindi Language & Comprehension (హిందీ భాషా పరిజ్ఞానం) – 20 ప్రశ్నలు (20 మార్కులు)
- English Language & Comprehension (ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం) – 20 ప్రశ్నలు (20 మార్కులు)
Section – B (Subject Concerned – 100 Marks)
- సంబంధిత సబ్జెక్ట్ (Mathematics/Science/English/Hindi/Sanskrit/Urdu/Punjabi) నుండి 100 ప్రశ్నలు ఉంటాయి.
- ఇక్కడ అభ్యర్థి తన టీచర్ పోస్టుకు సంబంధించిన సబ్జెక్ట్ పరిజ్ఞానం పరీక్షించబడుతుంది.
Also Read : University of Hyderabad Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్
జీతం వివరాలు(Salary Details):
DSSSB TGT Teacher Recruitment 2025 TGT టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-7 ప్రకారం రూ.44,900 నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం(How to Apply):
DSSSB TGT Teacher Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు DSSSB అధికారిక వెబ్‌సైట్ dsssbonline.nic.in ని సందర్శించాలి.
- నోటిఫికేషన్ పై క్లిక్ చేసి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 9 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 7 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : DDA Recruitment 2025 | 1732 పోస్టులకు భారీ నోటిఫికేషన్
2 thoughts on “DSSSB TGT Teacher Recruitment 2025 | 5,346 TGT టీచర్ జాబ్స్.. పూర్తి వివరాలు ఇవిగో..”