DRDO SSPL Recruitment 2025 | MTS & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

DRDO SSPL Recruitment 2025: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) పరిధిలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ(SSPL) కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. సెప్టెంబర్ 26వ తేదీను వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. 

DRDO SSPL Recruitment 2025 Overview

నియామక సంస్థDRDO 
లాబొరేటరీ పేరుసాలిడ్  స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ(SSPL), ఢిల్లీ
పోస్టు పేరుప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎంటీఎస్
పోస్టుల సంఖ్య14
ఎంపిక ప్రక్రియవాక్ ఇన్ ఇంటర్వ్యూ

Also Read : ECIL Technical Officer Recruitment 2025 | ఎలక్ట్రానిక్స్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఇప్పుడే అప్లయ్ చేయండి..

ఖాళీల వివరాలు : 

ఢిల్లీలోని తిమార్ పూర్ లో ఉన్న DRDO పరిధిలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 1 : 12
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 2 : 01
  • ఎంటీఎస్ : 01

అర్హతలు : 

DRDO SSPL Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటుంది. 

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-1: సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-2: ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ లో ఐటీఐ / డిప్లొమా
  • ఎంటీఎస్ : 12వ తరగతి + టైపింగ్ స్కిల్స్ + బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్ స్కిల్స్

వయోపరిమితి : 

DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ: 

DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • ఇంటర్వ్యూ

Also Read: DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

DRDO SSPL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-1: రూ.30,000/-
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 : రూ.26,000/-
  • ఎంటీఎస్ : రూ.22,000/-

దరఖాస్తు విధానం : 

DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

  • సరైన తేదీ మరియు సమాయానికి ఇంటర్వ్యూ వేదికకు వెళ్లాలి. 
  • రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకెళ్లాలి. 
  • అన్ని ఒరిజనల్ విద్యా మరియు కమ్యూనిటీ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. 
  • అన్ని టెస్టిమోనియల్స్ యొక్క స్వీయ ధ్రువీకరించబడిన జిరాక్స్ కాపీలు మరియు ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. 

ఇంటర్వ్యూ వేదిక : 

  • సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ, లక్నో రోడ్, తిమార్పూర్, డిల్లీ – 110054
  • తేదీ మరియు సమయం : 26 సెప్టెంబర్, 2025 ఉదయం 9:00 గంటలకు
NotificationClick here

Also Read : NIRDPR Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖలో డేటా ఎన్యూమరేటర్ పోస్టులు

Follow Google News
error: Content is protected !!