DRDO LRDE Apprentice Recruitment 2025 | డీఆర్డీఓలో 105 ఖాళీలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

DRDO LRDE Apprentice Recruitment 2025 : బెంగళూరులోని డీఆర్డీఓ – ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్( LRDE) నుంచి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 4వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

ఖాళీల వివరాలు : 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్) : 23
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్) : 25
  • డిప్లొమా(ఇంజనీరింగ్) అప్రెంటిస్ : 27
  • ఐటీఐ అప్రెంటిస్ : 30

మొత్తం ఖాళీల సంఖ్య : 105

Also Read : OnePlus 15 Set to Launch in India Soon – Stunning Design, Power-Packed Specs & Massive Upgrades!

అర్హతలు : 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్) : ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Com, BBA, B.Sc (Chem/CS/Maths/Physics), BCA, B.Lib.Sc 
  • డిప్లొమా(ఇంజనీరింగ్) అప్రెంటిస్ : ECE, CSE/IT, Mechanical, Electrical, Civil విభాగాల్లో డిప్లొమా
  • ఐటీఐ అప్రెంటిస్ : సంబంధిత ట్రేడులో ITI సర్టిఫికేట్

వయోపరిమితి : 

అభ్యర్థులకు 04 నవంబర్ 2025 నాటికి 18 ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ :

  • అభ్యర్థులను విద్యార్హతల్లో పొందిన మార్కులు, రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అన్ని సర్టిఫికేట్‌లు పరిశీలన సమయంలో చూపించాలి.

Also Read : ISRO SDSC SHAR Recruitment 2025 |  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన అప్రెంటిస్ స్టైపెండ్ ఇవ్వబడుతుంది. ప్రతి కేటగిరీకి వేర్వేరు స్టైఫండ్ ఉంటుది. 

దరఖాస్తు విధానం : 

  • ITI అభ్యర్థులు  NAPS పోర్టల్ లో నమోదు కావాలి.
  • Graduate / Diploma అభ్యర్థులు  NATS పోర్టల్ లో నమోదు కావాలి.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, రిజిస్ట్రేషన్ ప్రింట్‌అవుట్ తీసుకుని, దరఖాస్తు ఫారమ్ నింపి కింద ఇచ్చిన చిరునామాలో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ వివరాలు:

  • తేదీ: 04 నవంబర్ 2025 (మంగళవారం)
  • సమయం: ఉదయం 9:00 గంటలకు
  • స్థలం:
    Electronics & Radar Development Establishment (LRDE),
    CV Raman Nagar, Bengaluru – 560093
NotificationClick here
Official WebsiteClick here

Also Read : POWERGRID Officer Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో బంపర్ జాబ్స్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!