DRDO LRDE Apprentice Recruitment 2025 | DRDO లో అప్రెంటిస్ పోస్టులు

DRDO LRDE Apprentice Recruitment 2025 బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మే 25వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యేయేషన్, డిప్లొమా మరియు ఐటీఐ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్ కి ఇది సువర్ణావకాశం. 

DRDO LRDE Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ప్రతిష్టాత్మకమైన  ప్రభుత్వ సంస్థతో కెరీర్ ప్రారంభించడానికి ఫ్రెషర్లకు ఇది ఒక మంచి అవకాశం. డిఫెన్స్ రీసెర్చ్  అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ రకాల ట్రేడ్లలో మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 58
  • డిప్లొమా అప్రెంటిస్ – 30
  • ఐటీఐ అప్రెంటిస్ – 30
  • మొత్తం పోస్టుల సంఖ్య  – 118

DRDO Graduate Apprentice Vacancy 2025

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలుఖాళీలు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్10
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ10
మెకానికల్ ఇంజనీరింగ్05
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్03
B.COm /BBA10
BSc (కెమిస్ట్రీ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్/ మ్యాథెమాటిక్స్ / ఫిజిక్స్ / PCM)10
B.Lib SC / B.Lib.I Sc05
BCA05

DRDO Diploma Apprentice Vacancies 2025

డిప్లొమా అప్రెంటిస్ విభాగాలుఖాళీల సంఖ్య
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్08
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ08
మెకానికల్ / ఆటోమొబైల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్08
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 04
సివిల్ ఇంజనీరింగ్02

DRDO ITI Apprentice Vacancies 2025

ఐటీఐ అప్రెంటిస్ విభాగాలుఖాళీల సంఖ్య
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా) / డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్క్ మెయింటేనెన్స్ / సాఫ్ట్ వేర్  టెస్టింగ్ అసిస్టెంట్05
ఎలక్ట్రీషియన్04
ఎలక్ట్రానిక్స్ మెకానికల్03
డ్రాఫ్ట్ మెన్ మెకానికల్02
ఫిట్టర్04
మెకానిస్ట్/సీఎన్సీ మెషీన్ టెక్03
మెకానిక్ మోటార్ వెహికిల్ / మెకానిక్ డీజిల్03
టర్నర్02
వెల్డర్ 02
ఫొటో గ్రాఫర్01
పెయింటర్01

అర్హతలు : 

DRDO LRDE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

అప్రెంటిస్ షిప్అర్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్B.Com / BBA / BSc / BCA / B.Lib SC / B.Lib.I Sc / ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ
డిప్లొమా అప్రెంటిస్ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా
ఐటీఐ అప్రెంటిస్ITI + NCVT సర్టిఫికెట్

ఇతర అర్హతలు : 

  • భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు 2023 లేదా ఆ తర్వాత సంవత్సరంలో గ్రాడ్యుయేట్, డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • రెగ్యులర్ విధానంలో గ్రాడ్యుయేట్, డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయస్సు : 

DRDO LRDE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 

DRDO LRDE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ : 

DRDO LRDE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్రెంటిస్ షిప్ ఇస్తారు. 

  • షార్ట్ లిస్ట్
  • రాత్ పరీక్ష / ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

DRDO LRDE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టయిఫండ్ ఇస్తారు. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : నెలకు రూ.9,000/- 
  • డిప్లొమా అప్రెంటిస్ : నెలకు రూ.8,000/-
  • ఐటీఐ అప్రెంటిస్ : నెలకు రూ.7,000/-

దరఖాస్తు విధానం : 

DRDO LRDE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింది ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 25 – 05 – 2025
Graduate / Diploma NotificationCLICK HERE
ITI NotificationCLICK HERE
Apply Online (Graduate / Diploma)CLICK HERE
Apply Online (ITI)CLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!