DRDO JRF DYSL-AI Recruitment 2025 | DYSL-AIలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలు

DRDO JRF DYSL-AI Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DYSL-AI) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, రీన్ ఫోర్స్ మెంట్ లెర్నింగ్ మరియు ఎన్ఎల్పీ టెక్నాలజీస్ పై పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 13వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

DRDO JRF DYSL-AI Recruitment 2025 

పోస్టుల వివరాలు : 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (DYSL-AI) నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

  • పోస్టు పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్
  • పోస్టుల సంఖ్య : 04

అర్హతలు :

DRDO JRF DYSL-AI Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • NET / GATE తో ఫస్ట్ డివిజన్ లో BE / B.Tech (లేదా) గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట స్థాయిలలో ఫస్ట్ డివిజన్ లో ME / M.Tech (లేదా) NET అర్హతతో ఫస్ట్ డివిజన్ లో బేసిక్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ

వయస్సు: 

DRDO JRF DYSL-AI Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య  వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

DRDO JRF DYSL-AI Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • షార్ట్ లిస్ట్: అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా లేదా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • ఆన్ లైన్ కోడింగ్ పరీక్ష : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్రథులకు ఆన్ లైన్ కోడింగ్  పరీక్ష నిర్వహిస్తారు. 
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ : ఆన్ లైన్ కోడింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

జీతం వివరాలు : 

DRDO JRF DYSL-AI Recruitment 2025  జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,100/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం:  

DRDO JRF DYSL-AI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ పారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారమ్ లో పూర్తి వివరాలు నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన అన్ని పత్రాలు జత చేసి పోస్టు ద్వారా లేదా మెయిల్ ద్వారా సమర్పించాలి. 

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ : డైరెక్టర్, DRDO యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( DYSL-AI), డాక్టర్ రాజా రామన్న కాంప్లెక్స్, రాజ్ భవన్ సర్కిల్, హై గ్రౌండ్స్, బెంగళూరు – 560001

ఈమెయిల్ ద్వారా సమర్పణ : పూర్తిచేసిన దరఖాస్తు కాపీలను స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన కాపీలను ‘Apply for JRF Recruitment 2025’ అనే సబ్జెక్ట్ లైన్ తో accounts.dysl-ai@gov.in మెయిల్ ఐడికి పంపాలి.

కావాల్సిన ధ్రువపత్రాలు : 

  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్
  • ప్రభుత్వ / PSU/స్వయంప్రతిపత్తి సంస్థలలో పనిచేసే అభ్యర్థులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)
  • విద్యా ధ్రువపత్రాలు (10వ తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్)
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం

ముఖ్యమైన తేదీలు : 

ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రచురణ తేదీ నుంచి 21 రోజులు లేదా జూన్ 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. 

NotificationCLICK HERE
ApplicationFormCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!