DRDO CEPTAM 11 Recruitment 2025 | “DRDOలో భారీ ఉద్యోగాల వెల్లువ! CEPTAM-11 ద్వారా 764 పోస్టుల భర్తీ – వెంటనే అప్లై చేయండి!”

DRDO CEPTAM 11 Recruitment 2025 : రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నుంచి మంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది.  ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నీషియన్-ఎ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 764 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఉన్న DRDO ల్యాబ్స్‌లో పనిచేసే గొప్ప అవకాశం కల్పిస్తాయి. 

ఖాళీల వివరాలు : 

DRDO నుంచి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం 764 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

మొత్తం పోస్టుల సంఖ్య : 764

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి : 561
  • టెక్నీషియన్-ఎ : 203

అర్హతలు : 

DRDO CEPTAM 11 Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి : గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ) లేదా ఇంజనీరింగ్ / టెక్నాలజీలో డిప్లొమా
  • టెక్నీషియన్-ఎ : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు NCVT / SCVT ఆమోదించిన నిర్దిష్ట ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

Also Read : SBI SCO Recruitment 2025 | SBIలో భారీ నోటిఫికేషన్ – 996 పోస్టులు – అవకాశం మిస్ చేసుకోకండి!

వయోపరిమితి : 

DRDO CEPTAM 11 Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

DRDO CEPTAM 11 Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విదానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

Senior Technical Assistant-B (STA-B) – Fee with Refund

General / OBC / EWS

  • చెల్లించాల్సిన మొత్తం: ₹750
  • Tier-1 పరీక్ష రాస్తే రీఫండ్: ₹500

SC / ST / PwBD / Ex-Servicemen

  • చెల్లించాల్సిన మొత్తం: ₹500
  • పరీక్ష రాస్తే ₹500 మొత్తం రిఫండ్

 Technician-A (Tech-A) – No Refund

General / OBC / EWS

  • చెల్లించాల్సిన మొత్తం: ₹600
  • రిఫండ్ లేదు

SC / ST / PwBD / Women / Ex-Servicemen

  • ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

DRDO CEPTAM 11 Recruitment 2025 అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 

  • టైర్-1 : CBT – జనరల్ ఆప్టిట్యూడ్
  • టైర్-2 : CBT – సబ్జెక్ట్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

టెక్నీషియన్ : 

  • టైర్ – 1 : CBT – జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్
  • టైర్ – 2 : CBT – సబ్జెక్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

DRDO CEPTAM 11 Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
  • టెక్నీషియన్ : రూ.19,900 – రూ.63,200/-

దరఖాస్తు విధానం : 

DRDO CEPTAM 11 Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.drdo.gov.in ని సందర్శించాలి. 
  • CEPTAM 11 Recruitment లింక్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 11 డిసెంబర్, 2025
  • చివరి తేదీ : 1 జనవరి, 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : UPSC CDS-I 2026 Notification | ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో బంపర్ జాబ్స్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!