DRDO ADRDE JRF Recruitment 2025 ఆగ్రాలోని ప్రముఖ DRDO సంస్థ అయిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ADRDE) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 05 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీలోపు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ఖాళీల వివరాలు
DRDO ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 05
- Mechanical Engineering – 2 పోస్టులు
- Aerospace Engineering – 1 పోస్టు
- Electronics Engineering – 1 పోస్టు
- Textile Engineering – 1 పోస్టు
అర్హతలు
- BE/B.Tech (First Division) + NET/GATE
లేదా - ME/M.Tech (First Division) – Graduate & Post Graduate Level లో
వయోపరిమితి :
- గరిష్టం 28 సంవత్సరాలు
- SC/ST – 5 సంవత్సరాల సడలింపు
- OBC – 3 సంవత్సరాల సడలింపు
అప్లికేషన్ ఫీజు :
DRDO ADRDE JRF Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
DRDO ADRDE JRF Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- దరఖాస్తుల స్క్రీనింగ్
- ఇంటర్వ్యూ
జీతం :
DRDO ADRDE JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఫెలోషిప్ సమయంలో స్టైఫండ్ అనేది అందజేస్తారు.
- నెలకు ₹37,000/- + HRA + మెడికల్ సదుపాయాలు
దరఖాస్తు విధానం :
DRDO ADRDE JRF Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- నిర్దేశించిన అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ తో అవసరమైన పత్రాలు జత్ చేసి కింది అడ్రస్ కి పంపాలి.
- కవర్ పై “Application for Fellowship of JRF” ని స్పష్టంగా రాయాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ :
- Director, ADRDE, DRDO, Post Box No. 51, Station Road, Agra Cantt – 282001
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 25 – 09 – 2025
Notification & Application : Click here