DRDO ADE Recruitment 2025 : DRDO కి చెందిన ప్రముఖ ప్రయోగశాల అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్చి 12వ తేదీలోపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. BE / B.Tech చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
DRDO ADE Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 06 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా పోస్టులు చూస్తే..
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 02
- మెకానికల్ ఇంజనీరింగ్ – 01
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ – 02
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 01
అర్హతలు :
DRDO ADE Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో BE / B.Tech / ME /M.Tech చేసిన వారు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు :
DRDO ADE Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
DRDO ADE Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అన్ని కేేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు ఉండదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
DRDO ADE Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా స్క్రీనింగ్ టెస్ట మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మార్చి 19, 20వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తరు.
జీతం :
DRDO ADE Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000/- జీతం చెల్లిస్తారు. దీంతో పాటు HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
DRDO ADE Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ ని డౌన్ లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. దీంతో పాటు 10వ తరగతి, ఇంటర్, బీఈ/బీటెక్ సర్టిపికెట్లు, గేట్ సోర్క్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ తదితర డాక్యుమెంట్స్ జత చేసి మార్చి 12వ తేదీ లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పంపాల్సిన మెయిల్ అడ్రస్ కోసం నోటిఫికేషన్ చూడండి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులకు చివరి తేేదీ : 12 – 03 – 2025
- స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ : 19 – 03 – 2025
- ఇంటర్వ్యూ కొనసాగింపు (అవసరమైతే) 20 – 03 – 2025
Notification & Application : CLICK HERE
Official website : CLICK HERE
I want job