CSL Executive Trainee Recruitment 2025: భారత ప్రభుత్వ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ, ఎలక్ట్రానిక్స్ మరియు నావల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు తక్కువగా ఉన్నాయి కదా అని నిరుత్సాహ పడకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారు దరఖాస్తు చేసుకోండి. ఇందులో జాయిన్ అయితే మాత్రమ జీతాలు భారీగా ఉంటాయి.

CSL Executive Trainee Recruitment 2025 Overview
నియామక సంస్థ | కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్(CSL) |
పోస్టు పేరు | ఎగ్జిక్యూటివ్ ట్రైనీ |
పోస్టుల సంఖ్య | 07 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 24 సెప్టెంబర్ – 15 అక్టోబర్ 2025 |
Also Read : SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 | SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ
ఖాళీల వివరాలు :
భారత ప్రభుత్వ మినీ రత్న షెడ్యూల్ ‘ఎ’ కంపెనీ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కంపెనీ సెక్రటరీ, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్ విభాగాలలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కంపెనీ సెక్రటరీ) | 3 |
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఎలక్ట్రానిక్స్) | 1 |
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(నావల్ ఆర్కిటెక్చర్) | 3 |
అర్హతలు :
CSL Executive Trainee Recruitment 2025 పోస్టను బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
- కంపెనీ సెక్రటరీ : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI) లో అసోసియేట్ సభ్యుడు లేదా 10 నెలల ప్రాక్టికల్ శిక్షణతో CS ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ లో ఉత్తీర్ణత. చేరిన 15 నెలల్లోపు అసోసియేట్ సభ్యత్వం పొందాలి.
- ఎలక్ట్రానిక్స్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65% మార్కులతో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత
- నావల్ ఆర్కిటెక్చర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65% మార్కులతో నావల్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ ఉత్తీర్ణత
వయోపరిమితి :
CSL Executive Trainee Recruitment 2025 అభ్యర్థులకు 15 అక్టోబర్ 2025 నాటికి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSL Executive Trainee Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.750/-
- ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
CSL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ (60 మార్కులు)
- గ్రూప్ డిస్కషన్ (10 మార్కులు)
- రైటింగ్ స్కిల్స్ (10 మార్కులు)
- పర్సనల్ ఇంటర్వ్యూ(20 మార్కులు)
Also Read : ISRO VSSV Recruitment 2025 | ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు
జీతం వివరాలు :
CSL Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.50,000/- స్టైఫండ్ లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ గా నియాకంపై రూ.40,000 – రూ.1,40,000/- వరకు ఉంటుంది. కొచ్చిలో సంవత్సరానికి సుమారు రూ.14 లక్షల ప్యాకేజీతో జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
CSL Executive Trainee Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cochinshipyard.in/ లోకి వెళ్లాలి.
- కెరీర్ విభాగంలో CSL Executive Trainee Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు ముందుగా SAP ఆన్ లైన్ పోర్టల్ లో వన్ టైమ్ రిజిస్ట్రరేషన్ పూర్తి చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత కావాల్సిన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుకు అప్లికేషన్ సమర్పించాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖస్తు ప్రారంభ తేదీ : 24 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IBPS RRB Notification 2025 | గ్రామీణ బ్యాంకుల్లో 12 వేల పోస్టులు.. అప్లయ్ చేశారా?
1 thought on “CSL Executive Trainee Recruitment 2025 | కొచ్చిన్ షిప్ యార్డ్ లో బంపర్ జాబ్స్”