CSIR NML Recruitment 2025 : CSIR – నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆసక్తి గల అభ్యర్థులు మే 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
CSIR NML Recruitment 2025
పోస్టుల వివరాలు :
జంషెడ్ పూర్ లోని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 14
కేటగిరీ | ఖాళీల సంఖ్య |
జనరల్ | 06 |
ఓబీసీ | 03 |
ఎస్సీ | 02 |
ఎస్టీ | 01 |
EWS | 02 |
అర్హతలు:
CSIR NML Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునేే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, జియాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ రంగాల్లో ME / M.Tech లేదా PhD ఉండాలి.
వయస్సు:
CSIR NML Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
CSIR NML Recruitment 2025 సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు రూ.500/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC / ST / PwBD / మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక ప్రక్రియ:
CSIR NML Recruitment 2025 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల ఆధారంగా షార్ట్ లిస్త్ చేస్తారు.
- ఉన్నత అర్హతలు
- రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ పేటెంట్
- సంబంధిత అనుభవం
- ఇంటర్వ్యూ
జీతం :
CSIR NML Recruitment 2025 సైంటిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం లెవల్ 11 కింద రూ.67,700 – 2,08,700/- జీతం ఇవ్వడం జరుగుతుంది. అంటే డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ కలుపుకుని నెలకు రూ.1,22,629/- జీతం వస్తుంది. దీంతో పాటు మెడికల్, ఎల్టీసీ, విద్యా భత్యం, ఎన్పీఎస్ కింద పెన్షన్ మరియు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
CSIR NML Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫీజు చెల్లించాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తులకు చివరి తేదీ : 08 – 05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |