CSIR NGRI Recruitment 2025 హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (CSIR NGRI ) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనరల్, ఫైనాన్స్ మరియు అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ తో సహా వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.38,483/- జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు మే 5వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
CSIR NGRI Recruitment 2025
Vacancy Details:
CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) | 08 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్ అండ్ అకౌంట్స్) | 01 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్) | 02 |
Education Qualification :
CSIR NGRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ టైపింగ్ ఉండాలి. ఇంగ్లీష్ లో నిమిసానికి 35 పదాలు లేదా హిందీలో నిమిసానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
Age Limit :
CSIR NGRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Application Fee:
CSIR NGRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
Selection Process:
CSIR NGRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష, ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటాయి. తుది మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష :
- పేపర్-1 : రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లేదు.
- పేపర్-2 : పేపర్ -2 లో జనరల అవేర్ నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్ నెస్ పై 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి ఒక మార్కు కట్ చేస్తారు.
టైపింగ్ టెస్ట్: టైపింగ్ టెస్ట్ మరియు కంప్యూటర్ స్కిల్స్ పరీక్షించడానికి ఒక అర్హత పరీక్ష ఉంటుంది. టైపింగ్ లో ఇంగ్లీష్ లో నిమిసానికి 35 పదాలు లేదా హిందీలో నిమిసానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
Salary Details :
CSIR NGRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.38,483/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply:
CSIR NGRI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. ఆ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Important Dates :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం | 02 – 04 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 05 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Government job